Monday, April 29, 2024

తెలంగాణ పాపమేమి?

- Advertisement -
- Advertisement -

14వ, 15వ ఆర్థిక సంఘాలు, నీతి ఆయోగ్ సంస్థ చేసిన సిఫారసుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.34,149 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పులరిగేలా న్యూఢిల్లీ చుట్టూ తిరిగినా కేంద్ర సర్కార్‌కు చీమకుట్టినట్లయినా లేదు. కానీ 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందనే ఉద్దేశ్యంతో 14 రాష్ట్రాల రెవెన్యూలోటును భర్తీ చేస్తున్న కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎందుకింత పగబట్టిందో అర్థం కేవలం రాజకీయపరమైన కారణాలతో తెలంగాణ ప్రజలను వేధింపులకు గురిచేయడం సబబుగా లేదని విమర్శకులు జాతీయ, అంతర్జాతీయంగా బహుళ ప్రాచుర్యం పొందిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు రాకుండా చేస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో అభాసుపాలవుతుందనే కుట్రపూరిత ఆలోచనలతోనే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను ఇవ్వడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. 2022-23వ ఆర్థిక సంవత్సరానికి 14 రాష్ట్రాల్లోని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10,549 కోట్ల రెవెన్యూలోటును కేంద్రం గ్రాంట్ల రూపంలో భర్తీ చేస్తోంది.

ఆర్థ్ధిక సంఘాల సిఫార్సులు రాష్ట్రానికి వర్తించవా?

14 రాష్ట్రాల రెవెన్యూ భర్తీ చేస్తున్న కేంద్రం
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకేనని వివరణ
రాష్ట్రానికి కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థ్ధిక
సంఘం, రూ.817 కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థ్ధిక
సంఘం చేసిన సిఫారసులు బుట్టదాఖలు
రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకింత కక్ష?
నీతి ఆయోగ్ సిఫార్సులకూ దిక్కులేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత ధోరణి, కక్షపూరిత వైఖరులు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఆర్థిక సంఘాల సిఫారసులు, నీతి ఆయోగ్ సంస్థ సిఫారసులను మిగతా రాష్ట్రాల్లో తుచ తప్పకుండా అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయానికొచ్చేసరికి ఆ సంస్థల సి ఫారసులను బుట్టదాఖలు చేస్తూ వస్తోంది. ఈ విష యంలో తెలంగాణ ప్రజలు చేసిన నేరమేమిటి? రాష్ట్ర ప్రభుత్వం చేసిన పాపమేమిటో మరెందుకు కేంద్రం ఇలా తెలంగాణ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్ర ఆర్థిక మూలాలనే దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. దేశంలోని 14 రాష్ట్రాల రెవెన్యూలోటును భర్తీ చేయమని 15వ ఆర్థ్ధిక సంఘం సిఫారసు చేసిందట, అందుకు తగినట్లుగా 2022-23వ ఆర్థిక సంవత్సరంలో ఆ 14 రాష్ట్రాలకు రూ. 86, 201 కోట్ల నిధులను గ్రాంటుగా విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు రూ.28వేల 733 కోట్ల 67 లక్షల నిధులను కూడా కేంద్రం ఆ 14 రాష్ట్రాలకు విడుదల చేసింది. తాజాగా ప్రస్తుత జులై నెల ఇన్‌స్టాల్‌మెంట్‌గా 7,183 కోట్ల 42 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది కూడా.

ఆ 14 రాష్ట్రాల రెవెన్యూ పూడ్చేందుకు ఆర్థిక సహాయం చేయమని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను తాము తప్పుబట్టడంలేదని, ఆ రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయడాన్ని కూడా తాము తప్పుబట్టడంలేదని, కాకుంటే అదే ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి రూ.6,268 కోట్లను గ్రాంటుగా విడుదల చేయమని కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని, ఆ నిధులను ఎందుకు ఇవ్వడంలేదని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని ఆర్థికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు, టిఆర్‌ఎస్ చెందిన కొందరు సీనియర్ నాయకులు కూడా కేంద్రాన్ని నిలదీస్తున్నారు.

అంతేగాక 14వ ఆర్థిక సంఘం కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్థిక నిర్వహణకు మెచ్చుకొని రూ.817 కోట్ల 93 లక్షల నిధులను గ్రాంటుగా ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ నిధుల్లో ఇప్పటి వరకూ ఒక్క రూపాయిని కూడా తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వేధిస్తోందని, ఇది పక్షపాత ధోరణి కాదా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కక్షసాధిస్తున్నట్లు కాదా వారు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ప్రధాని మోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సంస్థ కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి మిషన్ భగీరథ పథకం ఏర్పాటు, అమలుతీరుకు మెచ్చుకొని రూ.19,205 కోట్లను గ్రాంటుగా ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. అంతేగాక మిషన్ కాకతీయ పథకానికి కూడా మరో రూ.5వేల కోట్లను కూడా గ్రాంటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని నీతి ఆయోగ్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

కానీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయిని కూడా తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం ఇలా చెప్పుకుంటూపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రావాల్సిన బకాయిలు మొత్తం కలిపి రూ.34 వేల 149 కోట్ల వరకూ ఉన్నాయని, ఆ నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారుల దగ్గర్నుంచి మంత్రులు హరీశ్‌రావు, కె.తారక రామారావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుల వరకూ ఎన్నో లేఖలు రాసినప్పటికీ, స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు ససేమిరా అంటోంది. చూస్తాం… చేస్తామంటూ సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తోందే తప్ప నిధులను విడుదల చేయడంలేదని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

14వ, 15వ ఆర్థిక సంఘాల సిఫారసులు, నీతి ఆయోగ్ సంస్థ చేసిన సిఫారసుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.34 వేల 149 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పులరిగేలా న్యూఢిల్లీ చుట్టూ తిరిగినా కేంద్ర సర్కార్‌కు చీమకుట్టినట్లయినా లేదని, కానీ 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందనే ఉద్దేశ్యంతో 14 రాష్ట్రాల రెవెన్యూలోటును భర్తీ చేస్తున్న కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎందుకింత పగబట్టిందో అర్థం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం రాజకీయపరమైన కారణాలతో తెలంగాణ ప్రజలను వేధింపులకు గురిచేయడం సబబుగా లేదని అంటున్నారు. జాతీయ, అంతర్జాతీయంగా బహుళ ప్రాచుర్యం పొందిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు రాకుండా చేస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో అభాసుపాలవుతుందనే కుట్రపూరిత ఆలోచనలతోనే కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను ఇవ్వడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. 2022-23వ ఆర్థిక సంవత్సరానికి 14 రాష్ట్రాల్లోని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10,549 కోట్ల రెవెన్యూలోటును కేంద్రం గ్రాంట్ల రూపంలో భర్తీ చేస్తోంది.

అదే విధంగా అస్సాం రాష్ట్రానికి 4,890 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 9,377 కోట్లు, కేరళకు 13,174 కోట్లు, మణిపూర్‌కు 2,310 కోట్లు, మేఘాలయ 1,033 కోట్లు, మిజోరాం 1,615 కోట్లు, నాగాలాండ్‌కు 4,530 కోట్లు, పంజాబ్ 8,274 కోట్లు, రాజస్థాన్ 4,862 కోట్లు, సిక్కిం 440 కోట్లు, త్రిపుర రాష్ట్రానికి 4,423 కోట్లు, ఉత్తరాఖాండ్ రాష్ట్రానికి 7,137 కోట్లు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 13,587 కోట్ల రూపాయలను రెవెన్యూలోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో నెల నెలా నిధులను విడుదల చేస్తోంది. ఇలా 15వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం తుచ తప్పకుండా అమలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్ల నిధులను కూడా విడుదల చేసేందుకు ఇకనైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మనసు మార్చుకొని నిధులను విడుదల చేస్తుందా? లేక ఇలానే వేధింపులకు గురిచేస్తుందా? అనేది కాలమే సమాధానం చెబుతుందని ఆ అధికారులు, సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News