Monday, April 29, 2024

వరంగల్‌లో బిజెపికి బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: తూర్పు నియోజకవర్గ బిజెపికి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు పాక సుధాకర్, బెసత సంఘం మహిళా అధ్యక్షురాలు, గతంలో కార్పొరేటర్‌గా పోటీచేసిన పొక్కుల సరోజన, తానం శ్రీనివాస్, జన్ను ప్రభాకర్ బుధవారం శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. కాగా సుధాకర్, వారి బృందం 33 ఏళ్లుగా బిజెపికి సేవలందించి పార్టీలో డివిజన్ అధ్యక్షుడిగా, బిజెవైఎం సెక్రెటరీగా ఎన్నో పదవులు చేపట్టి నేడు తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని సహించలేక కెసిఆర్ నాయకత్వం, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అభివృద్ధిని చూసి వారి వెంట నడవాలని బిఆర్‌ఎస్‌లో చేరగా ఎమ్మెల్యే వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వ అవులంభిస్తున్న తీరు నచ్చక నేడు కెసిఆర్ తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేస్తున్న తీరు, వారి నాయకత్వంలో తాము చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పాక సుధాకర్, వారి బృందం బిఆర్‌ఎసలో చేరడం జరిగిందని 33 ఏళ్లు సేవలందించిన నాయకులు సైతం బిజెపి పార్టీని వద్దనుకొని బిఆర్‌ఎస్‌లో చేరడం బిజెపి ప్రభుత్వం తెలంగాణ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందనడానికి నిదర్శనమన్నారు.

సుధాకర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించేందుకు కృషి చేయాలన్నారు. జెడ్‌ఆర్‌సీ మెంబర్ చింతాకుల సునీల్, నాయకులు కూచన క్రాంతికుమార్, చెమ్మబోయిన విమల, కంట నిర్మల, బొల్లోజు సుధాకర్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News