Sunday, April 28, 2024

బిజెపికి 50 సీట్లు తగ్గొచ్చు: శశిథరూర్

- Advertisement -
- Advertisement -
2024 ఎన్నికల్లో 2019 స్థాయి ఓట్లు గెలువడం కష్టం!

కొళికోడ్: ‘బిజెపి 2019లో గెలిచినంత స్థాయిలో 2024లో గెలువడం అసాధ్యం’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ శుక్రవారం అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బిజెపి 50 సీట్లయినా కోల్పోతుందన్నారు. తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడైన ఆయన కేరళ సాహిత్య ఉత్సవంలో ప్రసంగించినప్పుడు ఈ విషయం చెప్పారు.
‘మీరు 2019 బిజెపి గెలిచిన సీట్లు చూస్తే..అది హర్యానా, గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రతి సీటు గెలుచుకుంది. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా తన పాగా వేసింది. ‘ఇప్పుడు బిజెపికి నాడు గెలిచినట్లు 2024లో బంపర్ గెలుపు అసాధ్యం అనిపిస్తోంది’ అని శశిథరూర్ చెప్పారు. ఆయన ‘ఇండియా@75: ప్రజాస్వామ్య సంస్థల గుండా నడక’ అనే సమావేశంలో ఆయన ప్రసంగించారు.

‘2019 ఎన్నికల్లో చివరి నిమిషాల్లో పుల్వామా దాడులు, బాలాకోట్ దాడి ఓట్లపై ప్రభావం చూపింది. అది 2024లో సాధ్యం కాదు. దానిఫలితంగా బిజెపి ఓట్లలో 50 సీట్లు పడిపోవచ్చు. ప్రతిపక్షాలు లాభపడవచ్చు’ అన్నారు. కొన్ని చోట్ల బిజెపి తన బలాన్ని నిలబెట్టుకుంటుందని శశిథరూర్ అన్నారు. అయితే దానికి తాను జవాబు చెప్పలేనన్నారు. 2019లో బిజెపి 543 సీట్లలో 303 సీట్లు గెలిచింది. ‘ఒకవేళ అది 250 గెలుచుకుని, ఇతరులు 290 గెలుచుకుంటే…బిజెపి 20 లేక 10 మందిని ఇతర పార్టీల నుంచి ఆకర్షించొచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా చేయొచ్చు. కానీ ఎలా, ఏమిటి అన్నది మనకు తెలియదు’ అంటూ చెప్పుకొచ్చారు.

‘కాంగ్రెస్‌ది కుటుంబ పాలన అంటారు. కానీ, మీరు చూసినట్లయితే ములాయం సింగ్ కుమారుడు, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, కరుణానిధి కుమారుడు, బాలథాకరే కుమారుడు, శరద్ పవార్ కూతురు, మేనల్లుడు ఇలా ఎంత మంది కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం లేదు?!’ అన్నారు. కేరళ సాహిత్య ఉత్సవాల్లో శశిథరూర్‌తో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News