Saturday, April 27, 2024

‘రైతుబంధు ఎత్తేస్తారంటూ’ దుష్ప్రచారం

- Advertisement -
- Advertisement -
BJP conspiracy to spread false propaganda on Raitubandhu

 

వరి వేసే రైతులకు రైతుబంధు కట్ చేయనున్నారని ఈటల పిఆర్‌ఒ చైతన్య పేరిట వాట్సాప్ మెసేజ్ కలకలం

హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని అసత్య బాకా మెసేజ్ పోస్టు చేసి వెంటనే నాలుక కరచుకొని తొలగింపు బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మంత్రి నిరంజన్‌రెడ్డి సహా పలువురు టిఆర్‌ఎస్ ప్రముఖులు

మన తెలంగాణ/ హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత వరి పంట వేసే వారికి రైతుబంధును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయనుందని, దీనికి సంబంధించిన ఉత్త ర్వులు పోలింగ్ ముగిసిన వెంటనే జారీ చేయ నున్నారని హుజూరాబాద్ బిజెపి అభ్యర్థ్ధి ఈటల రాజేందర్ పిఆర్‌ఒ చైతన్య పేరిట వాట్సాప్ గ్రూప్‌లో సందేశం ప్రత్యక్షం కావడంతో పెను వివాదానికి కారణమైంది. దీనిపై ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని ఆ మెసేజ్‌లో చైతన్య మిగతా గ్రూప్ సభ్యులకు సూచిస్తున్నట్టు అందులో ఉండడం కలకలం రేపింది. అయితే ఆ సందేశం కొద్ది సెకన్లలో ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి మాయ మై నట్లుగా తెలుస్తోంది. అప్పటికే కొందరు చైతన పేరిట వచ్చిన మెసేజ్‌గా ఆరోపిస్తూ స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేశారు. దీనిపై టిఆర్‌ఎస్ నేత లు మండి పడ్డారు. తగ్గు చర్యలు తీసుకోవాలని డిజిపికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావుతో పాటు పలువురు టిఆర్‌ఎస్ నేతలు స్పందించి బిజెపి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. రైతుబంధుపై బిజెపి ఎన్నికల కుట్ర గా అభివర్ణిస్తూ ధ్వజమెత్తారు. కమలనాధులపై ఆగ్రహంతో ఊగిపోయా రు. కేవలం ఉపఎన్నికల్లో లబ్ధిపొందాలన్న రాజకీయ స్వార్థంతోనే బిజెపి మరి ఇంత దిగజారి వ్యవహరిస్తోందని మంత్రులు కన్నెర్ర చేశారు. బంధుపై ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుచేసేందుకే కొందరు దుర్మార్గులు తాత్కాలిక లబ్ధికోసం రైతుబంధుపై తప్పుడు ప్రచారం చేస్తు న్నారని, అలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. రైతుబం ధు ఎట్టిపరిస్థితుల్లో ఆగదని స్పష్టం చేశారు.

దురుద్దేశపూర్వకంగానే ఆసత్య ప్రచారం

రైతు బంధుపై బిజెపి దురుద్దేపూర్వకంగానే అసత్యం ప్రచారం చేస్తున్నదని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. దీనిపై నిండు శాసనసభలో సిఎం కెసిఆర్ స్పష్టమైన హామి ఇచ్చారన్నారు. తాను బ్రతికున్నంత కాలం రైతుబంధును ఎవరు తాకలేరని సిఎం పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించడమే కాదు….కొనుగోలు చేసే బాధ్యత కూడా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ఉమ్మడి జాబితాలోని ఐటం నంబర్ 30లో ఈ విషయం స్పష్టంగా పొందుపరచబడిందని వారు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత చేతకాకుంటే రాజ్యాంగాన్ని సవరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కేంద్రం కేవలం పంటల మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుని….ఆ భారం రాష్ట్రాల మీద వేస్తుందని మండిపడ్డారు.

నా సవాల్‌కు స్పందనేది ?

తాను విసిరిన సవాల్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి ఇప్పటి వరకు తగు స్పందన రాలేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీక్షకు కూర్చున్నవాళ్లు ఫలాయనం చిత్తగించారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నా….తన సవాల్ స్వీకరించి కేంద్రం నుండి లేఖ తేలేకపోయారని మంత్రి సింగిరెడ్డి విమర్శించారు. బియ్యం కొనుగోళ్లపై తోక ముడిచిన వారు కెసిఆర్ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కయిందని అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం అంటేనే ప్రభుత్వమన్నారు. తెలంగాణ అంటేనే రైతన్నల రాష్ట్రమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రానిది దళారి పాత్ర అనే బిజెపి నేత మొన్నటి దాకా గుజరాత్‌లో మూడు సార్లు ము ఖ్యమంత్రిగా చేసిన మోడీది దళారి పాత్ర అని ఒప్పుకుంటారా? అని ప్ర శ్నించారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు జుగుప్సాకరమైన, సభ్యత లే ని విమర్శలు మానుకోవాలని సూచించారు. ఉత్తరాదిన పంటలు కొనే కేంద్రం దక్షిణాదిన ఎందుకు కొనదని ఆయన ప్రశ్నించారు. యి పార్టీ కూడా గల్లీ స్థాయిలో సిల్లీ పనులు చేస్తున్నాయని స్థాయి లో ధ్వజమెత్తారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనరేట్ ముట్టడి చేస్తుందా? ఇంత చిల్లర పనులా ? వరి ధాన్యం వ్యవసాయ కమీషనర్ కొంటారా? అని ప్రశ్నించారు.

హుజూరాబాద్‌లో బిజెపి విచ్చలవిడిగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతుందని మంత్రి సింగిరెడ్డి ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 48 గంటల ముందు ప్రచారం మానుకోవాలన్నా రు. కాని బిజెపి ఈటల ప్రెస్‌మీట్‌కు ప్రయత్నించారన్నారు. ఆ పార్టీ చేసిన తప్పుడు ఫిర్యాదు చేసినా టిఆర్‌ఎస్ ఎంపి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో సోదాలు చేశారన్నారు. కమలం పార్టీ ఎంపిలకు చిత్తశుద్ధి ఉంటే మార్కెట్‌లో మద్దతుధర లభించని పంటలన్నీ కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్తులో కేంద్రం కొనుగోళ్లకు చేతులెత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం, కందులు, మొక్కలు, పప్పుశనగ , జొన్నలు కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్రం సకాలంలో డబ్బులివ్వకున్నా రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని వేల కోట్లు రూపాయలను బ్యాంకుల ద్వారా సేకరించి పంటలు కొనుగోలు చేస్తున్నామన్నారు. దీనిని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా?

అని కాగా తెలంగాణ వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అంశంపై మీడియా ప్రశ్నలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానమిస్తూ తండ్రికి సమకాలీకుడు, అంతకుమించి రాష్ట్రంలో, కేంద్రంలో పదవులు అధిష్టించిన, రాష్ట్రాన్ని సాధించి న, మహాద్భుతమయిన ఉద్యమాన్ని నడిపిన కెసిఆర్‌ను ఏకవచనంతో తూలనాడుతుందా? అని ప్రశ్నించారు. ఆయనను పట్టుకుని నువ్వు సచ్చిపో, తాగుబోతు అనడం సంస్కారమా? అని మంత్రి నిలదీశారు. దీనిని ప్రశ్నించే బాధ్యత మనందరి మీద లేదా అసలు ఆమె ఎవరు ఇక్కడ ప్రశ్నించడానికి? ఇది సంస్కృతా? ఇది సంస్కార మా అని వ్యాఖ్యానించారు. తనకు సభ్యత, సంస్కారం, విలువలు ఉన్నాయన్నారు. తాను ఎక్కడా షర్మిల పేరు ఉచ్చరించలేదన్నారు. సంస్కారవంతంగానే అర్ధమవుతుంది. వారు అన్వయించుకుని బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు.

వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

రైతుబంధు పై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మంత్రి సింగిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు, తాత్కాలిక లబ్ది కోసం కొందరు దుర్మార్గుల కుట్రగా ఆయన అభివర్ణించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాలని రాష్ట్ర డిజిపిని వ్యవసాయ శాఖ నుండి కోరడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరన్నారు. విపత్తు సమయంలోనే మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉద్యోగుల జీతాలలో కోత విధించి రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడం జరిగిందన్నారు. ఇది కెసిఆర్ గొప్పతనం అని అన్నారు. కుట్రదారులు, ద్రోహబుద్ది కలిగిన వారు ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేసేందుకు చేసే ప్రయత్నాలు చూసి ఎవరూ ఆందోళనకు గురి కావద్దు అని అన్నారు. రైతుబంధు యధావిధిగా కొనసాగుతుందని… రాష్ట్ర రైతాంగానికి హామీ ఇస్తున్నానన్నారు.

బాయిల్ రైస్ మాత్రమే కొనమని

వరి కొనుగోలుపై కేంద్రం ఇచ్చిన లేఖపై జరుగుతున్న ప్రచారంపై బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ స్పష్టత ఇచ్చారు. కేవలం బాయిల్ రైస్ మా త్రమే కొనమని కేంద్రం చెప్పినట్టు తెలిపారు. దీనిపై ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు రైతులకు చేసిందేమి లేదని ఆరోపించారు. డబ్బులు సంపాదించుకోవటం తప్పా చేసింది శూన్యమని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన లేఖలో ఎక్కడ కూడా వడ్లు కొనమని చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఎవరు వచ్చినా చర్చకు సిద్ధమని అర్వింద్ సవాల్ విసిరారు. దీనిపై మంత్రులు ఇష్టమొచ్చినట్లు మా ట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం వరకు 2 కోట్ల టన్నులైనా కొంటామన్నారు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారని ఆయన నిలదీశారు. ఏడేళ్లలో ఎంత ధాన్యం ఎగుమతి చేశారో దమ్ముం టే సిఎం కెసిఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయరంగంలో ప్రపంచమంతా టెక్నాలజీ పెంచుకుని దూసుకుపోతోంది మీరు కూడా టెక్నాలజీ పెంచుకుని అభివృద్ధి సాధించాలని లేఖలో కేంద్రం పేర్కొంది. కేవలం బాయిల్ రైస్ కొనమని మాత్రమే కేంద్రం చెప్పింది. గరీబోళ్లు తినే బియ్యాన్ని ఫోర్టిఫై చేసేందుకు తెలంగాణ ప్రాంతంలోని రైస్ మిల్లులను అడ్వాన్స్ చేసుకోవాలని చెబుతోందన్నారు. ఏడేళ్లలో ఏ పంటకు బోనస్ ఇచ్చారో చెప్పాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News