Sunday, April 28, 2024

40 శాతం కమీషన్లు: కాంగ్రెస్‌పై బిజెపి పరువునష్టం దావా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో ఇదివరకటి బిజెపి ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్లు పుచు చ్చుకుందని ఆరోపిస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సాగించిన ప్రచారంపై బిజెపి కోర్టులో పరువునష్టం దావావేసింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీపై బిజెపి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట పరువునష్టం దావా దాఖలు చేసింది.

మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసులను విచారించడానికి ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ప్రతివాదులకు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఈ కేసు తుపరి విచారణను జులై 27వ తేదీకి వాయిదా వేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తప్పుడు ఆరోపణలతో బిజెపి ప్రతిష్టను దెబ్బతీస్తూ కాంగ్రెస్ పారీ అన్ని ప్రధాన దినపత్రికలలో ప్రకటనలను ప్రచురించినట్లు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కెశవప్రసాద్ మే 9న తన ప్రైవేట్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అప్పటి బిజెపి ప్రభుత్వం 40 శాతం కమీషన్లతో అవినీతికి పాల్పడి నాలుగేళ్లలో 1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినట్లు కెపిసిసి అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే 5న అన్ని ప్రధాన వార్తాపత్రికలలో ప్రకటనలు గుప్పించిందని ఆయన ఆరోపించారు. ఇవి నిరాధార, దురుద్దేశపూర్వక, పరువునష్టంతో కూడిన ఆరోపణలుగా ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News