Monday, April 29, 2024

మధ్యప్రదేశ్‌లో బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఈ నెల 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ శనివారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. గోధుమలకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,700, వరి ధాన్యానికి రూ.3,100లు లభించేలా చూస్తామని , రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘ లడ్లీ బహ్నా’ కార్యక్రమం కింద లబ్ధిదారులందరికీ గృహ వసతి కల్పిస్తామని మేనిఫెస్టోలో ఆ పార్టీ హామీ ఇచ్చింది. పేదకుటుంబాలకు చెందిన బాలికలకు పోస్టుగ్రాడ్యుయేషన్ వరకు, పేద విద్యార్థులకు12వ తరగతి వరకు ఉచిత విద్యనందిస్తామని, లడ్లీ బహ్నా పథకం, పిఎం ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు రూ.450కే వంటగ్యాస్ సిలిండర్‌ను అందిస్తామని కూడా ఆ పార్టీ హామీ ఇచ్చింది.96 పేజీలతో సంకల్ప్ పత్ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విడి శర్మ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, ఇతర పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు.

గోధుమలకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,700, ధాన్యానికి రూ.3,100లు లభించేలా చూస్తామని కూడా బిజెపి తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. లడ్లీ బహ్నా కార్యక్రమం లబ్ధిదారులకు గృహవసతి, ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి అవకాశం కల్పిస్తామని కూడా ఆ పార్టీ హామీ ఇచ్చింది. అంతేకాదు బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐఐటిల తరహాలో టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్లు, ఎయిమ్స్ తరహాలో వైద్య సంస్థలను ఏర్పాటు చేస్తామని కూడా బిజెపి తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో ఆరు కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలను ఏర్పాటు చేస్తామని, గిరిజనుల సాధికారత కోసం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తామని కూడా ఆ పార్టీ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోను ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌గా చేయడం ద్వారా దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసే ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని నడ్డా తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా మేనిఫెస్టో అమలుపై నిఘా ఉంచుతుందని కూడా ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News