Saturday, April 27, 2024

బిజెపి కార్యకర్తలపై బాంబు దాడి: ఆరుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బిజెపి కార్యకర్తలపై జరిగిన బాంబు దాడిలో ఆరుగురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జిల్లాలోని గోసబా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా.. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కొందరు వారిపై దాడి చేశారని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ సంఘటన ఓ బిజెపి నాయకుడి ఇంట్లో జరిగిందని, అక్కడ నాటు బాంబులు తయారు చేస్తుండగా, ప్రమాదవశాత్తు అవి పేలాయని పోలీసులు చెప్తున్నారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, స్థానికులతో మాట్లాడుతున్నామని ఓ పోలీసు అధికారి ఫోన్‌లో పిటిఐకి చెపారు.

కాగా శుక్రవారం గోసబా ప్రాంతంలో బిజెపి, టిఎంసి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిందని, పరస్పరం బాంబులు విసురుకు న్నారని, ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారని అనధికారిక వార్తలను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆ పోలీసు ఆధికారి చెప్పారు. గాయపడిన వారిని చికిత్స కోసం కన్నింగ్ సబ్ డివిజనల్ ఆస్పత్రిలో చేర్పించారు.

Bomb Attack on BJP Workers in West Bengal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News