Monday, April 29, 2024

అంబేద్కరిజంతోనే మార్పు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే బి.ఆర్.అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. దేశానికి రక్షణ సమస్య వస్తే.. మరో రాజధాని అవసరమని అందుకు హైదరాబాదే సరైందని అంబేద్కర్ చెప్పారని పేర్కొన్నారు. ఎందుకంటే పాక్, చైనా నుంచి భాగ్యనగరం ఎంతో దూరంలో ఉందని భావించి.. ఆనాడే ఎంతో దూరదృష్టి తో ఆలోచించారని అన్నారు. కాని ఆ ఆశయం నెరవేరలేదని గుర్తు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నెలకొల్పిన 125 అడుగుల బి.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం (అంబేద్కరిజం) ఎంతో అవసరమని.. ఆయన ఆదర్శాలను పాటించడమే మనం అందరం అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం రాక ముందు ఆంగ్లేయులు భారతావనిని ఏ విధంగా దోచుకున్నారో గ్రహించి.. అంబేద్కర్ 1923లోనే రూపాయి సమస్యపై ఒక పరిశోధన పత్రాన్ని రాశారని చెప్పారు.

రూపాయి బలోపేతం.. దాని ఆవశ్యకతను ఆనా డే అంబేద్కర్ నొక్కి చెప్పారని వివరించారు. అంటరానితనాన్ని పారదోలడానికి అంబేడ్కర్ ఎంతగానో కృషి చేశారని ప్రకాశ్ అంబేద్కర్ వివరించారు. మైనార్టీ మతాలే కాకుండా, మైనారీ కులాలు కూడా ఉన్నాయని చెప్పారు. భారతదేశంలో కొన్ని అతిచిన్న కులాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. దళితబంధు గొప్ప పథ కం అని ప్రకాశ్ అంబేద్కర్ కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని వి ధంగా.. కేవలం దళితుల కోసమే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని రూపొందించిన సిఎం కెసిఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు తెలంగాణ సి ఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కెసిఆర్ ముందుకు తీసుకెళుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు ముందుగా అంబేడ్కర్ మద్దతిచ్చారని ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఆయన ప్రాణ త్యాగం చేసేవరకు సమస్య పరిష్కరించలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం కూడా ఎంతో పోరాటం జరిగిందని పేర్కొన్నారు.

తెలంగాణ దేశానికి కొత్త దారి చూపింది

ప్రస్తుతం దేశంలో జాతీయ నాయకులు కరువయ్యారని ప్రకాశ్ అం బేద్కర్ అన్నారు. దేశంలో వాజ్‌పేయి వంటి జాతీయ నాయకులు కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి కొత్తదారి చూపించిందని చెప్పారు. జాతి, ధర్మాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలని ఆకాంక్షించారు. దేశంలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తశకానికి నాంది పలికారని వెల్లడించారు.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ కృషిచేశారని, అంబేడ్కర్ మార్గాన్నే కెసిఆర్ ఎంచుకున్నారని అన్నారు. బి.ఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News