Monday, April 29, 2024

బిఆర్‌ఎస్ జెండానెత్తుకున్న పసివాడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఓ బాలుడు బిఆర్‌ఎస్ పార్టీ జెండాను పట్టుకుని కనిపించాడు. వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ బాలుడిని తన వద్దకు పిలుచుకుని, జెండాను భుజానికెత్తుకున్న ఆ బాలుడిని మంత్రి తన భుజానికెత్తుకున్నారు. పసివాళ్ళు ఏం చేసినా ఆనందంగా అనిపిస్తుంది. పెద్దవాళ్లు ఏం చేసినా అభిమానంగా ఉంటుంది. ఈ ఘటన పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగరలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో చోటు చేసుకుంది.

మండలంలోని పడమటి తండాకు చెందిన ధరావత్ చిరంజీవి – సుమతిల కుమారుడు అక్షిత్, అతని నానమ్మ అఖిలీతో కలిసి వచ్చాడు. అక్కడ జెండా కనిపిస్తే కావాలని అడగడంతో అక్షిత్ నానమ్మ ఆ జెండాను ఆ బాలుడికి ఇచ్చింది. ఆ బాలుడు కాస్త ఆ జెండాను పట్టుకుని మంత్రికి కనిపించడతో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.ఆ పసివాడిని మంత్రి ఎర్రబెల్లి ఎత్తుకోవడం, ముద్దు చేయడం అందరినీ ఆకర్షించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News