Sunday, April 28, 2024

పారిశుద్ధ కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: దేశంలో ఎక్కడ లేని విధంగా పారిశుద్ద కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవా రం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా వేతనాలు అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల్లో 500,1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బ తకాలనే ఉద్దేశ్యంతో అడగకుండానే ఈ మధ్యే 8 వేల 500 పెంచారన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత ప్రా ంతాలలో కనీసం మనుషులుగా కూడా చూడట్లేదన్నారు. ప్రభుత్వాలు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో 200, ఆంధ్రప్రదేశ్‌లో 6 వేలు, చత్తీస్ ఘడ్‌లో ఆసలు ప్రభుత్వం వేతనం ఇవ్వటం లేదన్నాఉ. గ్రామ పంచాయతీలే తోచినంత ఇస్తున్నాయని తెలిపారు.

సిఎం పల్లె ప్రగతి లాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచేట్లు చేశారు. ఈ విజయంలో గ్రామ పంచాయతీల సెక్రటరీలు, మల్టిపర్సస్ వర్కర్ల పాత్ర మరువలేనిదని తెలిపి వారిని అన్ని విధాలుగా గౌరవంగా చూసుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. పనికి మాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడోద్దని సిఎం మిమ్మల్నందరని చల్లగా చూస్తారన్నారు. ఎలాంటి సమ్మెలు, దర్నాలు, వంటి కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ పల్లెలకున్న గొప్ప పేరును ఖరాజు చేయొద్దని వేడుకుంటున్నారు. అలాగే కొంత మంది క్యాలిపైడ్ కార్మికులు, అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా గుర్తింపు నివ్వాలని మంత్రి హరీశ్‌రావు, సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెలుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News