Monday, April 29, 2024

‘బుట్ట బొమ్మా’ వీడియో సాంగ్ కు రికార్డు వ్యూస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో‘ సినిమా ఈ యేడాది బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఇక, ఈ సినిమా పాటలు ఓ రేంజ్ లో ప్రేక్షకులను అలరించాయి. సినిమాలోని ‘బుట్ట బొమ్మా’, ‘సామజవరగమన’, ‘రాములో రాములో’ పాటలు వందల మిలియన్స్ తో సంచలనం సృష్టించాయి. యూట్యూబ్ లో ఈ పాటలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆల్బమ్ ఇప్పటికే 1 బిలియన్ వ్యూస్ దక్కించుకుని అరుదైన రికార్డు నెలకోల్పింది. ముఖ్యంగా ‘బుట్ట బొమ్మా’ వీడియో సాంగ్ దేశవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా స్టెప్పులేశారు. తాజాగా ‘బుట్ట బొమ్మా’ వీడియో సాంగ్ మరో రికార్డు సృష్టించింది. ‘బుట్ట బొమ్మా’ వీడియో సాంగ్ ఏకంగా 250 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. దీంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.

Butta Bomma Video song gets 250 million views

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News