Monday, April 29, 2024

భారత్‌లో “నవ్వుల మూట” గా మారిన కెనడా ప్రధాని ట్రూడో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలతో ముఖ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో దౌత్యసంబంధాలు నెరిపే విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో “నవ్వుల మూట ” గా తయారై హాస్యాస్పదం కలిగిస్తున్నారని కెనడా విపక్షనేత, కన్జర్వేటివ్‌పార్టీ నేత పియరీ పోలివ్రే ధ్వజమెత్తారు. నేపాల్ మీడియా సంస్థ నమస్తే రేడియో టోరంటోకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను కెనడా దౌత్యవేత్తలు విడిచిపెట్టాలని ట్రూడో పిలుపునివ్వడంపై అడగ్గా, ఆయన అసమర్ధ ప్రధాని అని ఆరోపించారు. భారత్‌తోసహా ప్రపంచ దేశాలు దాదాపు ప్రతిదేశం తోనూ కెనడా సంబంధాలను దెబ్బతీశారని, ప్రతిదేశం తోనూ కెనడా ప్రధాన వివాదాలతో ఉంటోందని మండి పడ్డారు.

భారత్‌తో కొన్ని విభేదాలున్నా వాటికి జవాబుదారీగా నిలవడం మంచిదని, ముఖ్యంగా సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. తాను ప్రధాని అయిన తర్వాత వీటిని పునరుద్ధరిస్తానని పియరీ పోలివ్రే పేర్కొన్నారు. కెనడా విదేశీ విధానంపై విమర్శలు గుప్పించిన పోలివ్రే , చైనా, అమెరికాల తీరుపై కూడా మండి పడ్డారు. స్థానికంగా రహస్యంగా పోలీస్ స్టేషన్లను తెరుస్తూ కెనడా అంతర్గత విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ట్రూడోను డోర్ మ్యాట్‌లా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కెనడా లోని హిందూ దేవాలయాలపై దాడులు జరగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News