Sunday, April 28, 2024

ఉప్పల్‌లో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

100కిలోలు గంజాయి స్వాధీనం, ముగ్గురి నిందితుల అరెస్టు
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.15లక్షలు
పరారీలో మరో నిందితుడు

మన తెలంగాణ/సిటీబ్యూరో: గంజాయి ని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోల గంజాయి, ఆటో, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. ఎపిలోని విశాఖపట్టనం, అన్నవరం మండలం, చోడవరానికి చెందిన షేక్ ఇస్మాయిల్, హైదరాబాద్, ధూల్‌పేటకు చెందిన అరుణ్ సింగ్, కర్నాటక రాష్ట్రానికి చెందిన మాంకారీ సతీష్ ఆటోడ్రైవర్, మాంకారీ ప్రకాష్ ఇద్దరు సోదరులు. షేక్ ఇస్మాయిల్ స్థానికంగా బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో 2017 నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. గంజాయిని సేకరించి హైదరాబాద్‌లోని అరుణ్‌సింగ్‌కు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే చింతపల్లి పోలీసులు 2017లో, రోలుగుంట పోలీసులు ఇస్మాయిల్‌ను అరెస్టు చేశారు. 2020, నవంబర్12వ తేదీన జై లు నుంచి ఆడమ రఘుపతిరెడ్డి సాయంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా కూడా పద్ధతి మర్చుకోకుండా మళ్లీ గంజాయి సరఫరా చేస్తున్నాడు. విశాఖ ఏజెన్సీలోని రాజు నుంచి కిలోకు రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి చింతపల్లి నుంచి హైదరాబాద్‌కు ఆటోలో తరలించేందుకు రూ.50,000 ఇస్తున్నాడు. ఇక్కడ శంకర్ అలియా స్ అరుణ్ సింగ్‌కు కిలోకు రూ.10,000చొప్పున విక్రయిస్తున్నాడు. అరుణ్‌సింగ్ ఆదేశాల మేరకు ఆటోలో గంజాయి తరలిస్తుండగా ఉప్పల్ ఇంటర్ సెప్టార్ పోలీసులు ఆటోను ఆపి తనిఖీలు చేయగా గంజాయి తరలిస్తున్న విషయం తెలిసింది. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ నర్సింగ్ రావు, ఎస్సై జయరాం, ఎఎస్సై హనుమాన్ నాయక్ నిందితులను పట్టుకున్నారు.
హైదరాబాద్‌లో….
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు హె ల్మెట్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అనిల్, శ్రీకాంత్ స్థానికంగా గంజాయిని విక్రయిస్తున్నారు. విష యం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ గట్టుమల్లు తదితరులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లంగర్‌హౌస్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News