Monday, April 29, 2024

నిరాశపరిచిన సింధు.. స్విస్ ఓపెన్ ఫైనల్లో మారిన్ చేతిలో ఓటమి

- Advertisement -
- Advertisement -

బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో తెలుగుతేజం పివి సింధు నిరాశపర్చింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది. వరుస సెట్లలో 12 21,5 21 తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. 35 నిమిషాల్లోనే ఫైనల్ పోరు ముగిసింది. కాగా మారిన్ చేతిలో సింధుకు ఇది మూడో ఓటమి. దాదాపు 18 నెలల తర్వాత సింధు ఫైనల్ ఆడగా, మారిన్ ఇదే ఏడాది మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. సింధు తర్వాత మార్చి 17నుంచి 21 వరకు జరిగే ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో ఆడనుంది.

Carolina Marin defeated P V Sindhu in Swiss Open Final

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News