Monday, April 29, 2024

టిఆర్‌పి దుర్వినియోగం కేసుపై సిబిఐ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

CBI probe into TRP abuse case

 

న్యూఢిల్లీ : టిఆర్‌పి (టెలివిజన్ రేటింగ్ పాయింట్స్) దుర్వినియోగం కేసు దర్యాప్తు బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంగళవారం సిబిఐ చేపట్టింది. అడ్వర్‌టైజ్ కంపెనీ ప్రొమోటర్ ఫిర్యాదుపై మొదట ఉత్తర ప్రదేశ్ లక్నో లోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు దాఖలైంది. ఇప్పుడు ఈ దర్యాప్తు బాధ్యతను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. సిబిఐ గుర్తింపు కాని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ దుర్వినియోగం కేసులో ప్రధానమైన ఆరోపణలు చెల్లింపులకు సంబంధించినవి. ఛానెల్స్‌లో అడ్వర్‌టైజింగ్ పాప్యులారిటీ సాధించడానికి టిఆర్‌పిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవలనే ముంబై పోలీసులు టిఆర్‌పి దుర్వినియోగంపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News