Monday, April 29, 2024

పోటీని చవిచూస్తేనే విజయం

- Advertisement -
- Advertisement -

‘The secret of success is learning how to use pain and pleasure instead of having pain and pleasure use you. If you do that, you’re in control of your life. If you don’t, life controls you’– Anthony Robbins
ఇటీవల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువరించాయి. చాలా ఏండ్లుగా నోటిఫికేషన్ల కోసం నిరీక్షి్స్తున్న నిరుద్యోగ యువత సంబంధిత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. పోస్టులకు గతంలో ఎన్నడూ లేనంత పోటీ ఉండటంతో సక్సెస్ పట్ల అభ్యర్థుల్లో గుబులు భయం పట్టుకున్నాయి.

పొద్దున సాయంకాలాల్లో టీ పార్కుల్లో కలుసుకునే యువమిత్రుల్లో పోటీ పరీక్షల విషయమై ఒకటే తర్జనభర్జన. వ్యక్తిగతంగా వ్యాసకర్త(నా)తో చేసే సంప్రదింపుల్లో ’మంచి ర్యాంకు ,మార్కులు ఎట్లా తెచ్చుకోవచ్చు? జాబ్ కొట్టడం ఎట్లా? ’ అనేవి వారు సంధిస్తున్న ప్రశ్నలు. నేను వాళ్లందరికీ చెబుతున్నదొకటే. మాయ మంత్రంఏదీ ఉండదు.చేయాల్సిందల్లా ఒక్కటే..అదే టాప్ పర్ఫార్మెన్స్. కేటగిరీ ఏదైనా టాప్ పర్ఫార్మర్లకే జాబ్ గ్యారెంటీ అని. టాప్ పర్ఫార్మెన్స్ అంటే ఏమిటని తిరిగి ప్రశ్న వస్తుంది.పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ అయితే ’ Working Memory + Marking Accurate Answers = Top Performance ’ అని, డిస్క్రిప్టివ్ పేపర్ కు అయితే ’ Presentation of quality of thoughts in quality of language = Top Performance’ అని చెబుతుంటాను.అట్లానే CAKE , STAR, ACHIEVE మొదలైన పదాలను పరీక్షార్థంలో విడమరచి చెబుతుంటాను.

ఏదైనా కాంపిటీటివ్ ఎక్జామ్స్ అన్నపుడు ఎవరి బలాబలాలు వాళ్లకుంటాయి.ఎంత గట్టిగా ప్రిపేర్ అయినా ఎక్కడో ఓ మూలన వత్తిడి, ఆందోళన ఉండనే ఉంటాయి.ఇదే సందర్భంలో కొద్దిగా తాత్త్వికంగా కూడా మాట్లాడతాను. ’ ఫ్రెండ్స్! జీవితంలో రెండు ఆప్షన్స్ ఉంటాయి.1.మన ఇష్టాలు,అయిష్టాలను మన జీవిత లక్ష్యానికి లోబడి ఏర్పరచుకోవడం.2.మన ఇష్టాలు అయిష్టాలకు మన జీవిత లక్ష్యాన్ని అధీన పరచడం’. రెండు ఎంపికల్లో ఇష్టమూ లక్ష్యమూ ఉన్నాయి. ఉన్నతోద్యోగమే ఇష్టమూ లక్ష్యమూ అయినప్పుడు,దేన్ని దేనికి అధీన పరచి నడచుకున్నా రెండూ సంపూర్ణంగా సిద్ధిస్తాయి.జాగ్రత్త పడవలసిందల్లా పోటీలో ఉండి పోటీపట్ల అయిష్టత,అలక్ష్యం చొరబడకుండా చూసుకోడమే, మానసికంగా దృఢంగా ఉండటమే.

పోటీ పరీక్షల పట్ల క్లీయర్ కట్ అవగాహన ఉండటం తప్పనిసరి.పోటీ ఎప్పుడు ఎట్లా ఎక్కడ మొదలవుతుందో తెలియాలి,దాని ముగింపూ తెలియాలి.లేదంటే అయిష్టత, అలక్ష్యం మనసులో తిష్ఠవేస్తాయి.అప్లై చేసుకున్న లేదా చేస్తున్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి అప్లై చేసిన వెంటనే అభ్యర్థుల మధ్య పోటీ (Competition) మొదలవుతుంది. పరీక్షలో పోటీ పడేవాళ్లందరూ పోటీదారు( Competitor)లే. అయితే పోటీలో అసలైన పోటీదార్లు( Real Competitors), నామ మాత్రపు పోటీదార్లు( Namesake Competitors) అంటూ రెండు రకాల పోటీదార్లు ఉంటారు.ఏ పోటీలోనైనా అసలైన పోటీదారులే నిజమైన పోటీదారులు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వాళ్లు కేవలం ఫ్రెష్ గ్రాడ్యుయేట్లే కాదు,అప్పటి దాకా ఆయా సబ్జెక్టుల్లో పాసై సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న వాళ్లూ ఉంటారు.

ఈ రెండు సమూహాల్లోనూ అసలైన పోటీదార్లు ఉంటారు.పరీక్షా విధానం రీత్యా అకడమిక్ ప్రవేశ పరీక్షలకు పోటీ ప్రవేశ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అకడమిక్ పరీక్షలు సంబంధిత సబ్జెక్టులకే పరిమితం. కాంపిటీటివ్ పరీక్షలు అట్లాకాదు, ఉద్యోగార్హమైన కనీసం నాలుగైదు రకాల కంటెంట్ ఉంటుంది. కొన్నిటిలో పరిమితంగా,మరికొన్ని పరీక్షల్లో విస్తృతంగా ప్రశ్నలడుగుతారు. ప్రశ్నలు కొన్నిటికి ఆబ్జెక్టివ్ టైపులోనూ,కొన్నిటికి డిస్క్రిప్టివ్ టైపులోనూ ఉంటుంటాయి. కొన్ని ఉద్యోగాలకు ప్రిలిమ్స్,మెయిన్స్ అంటూ రెండు దశలూ ఉంటాయి.అది ఏటైపు ప్రశ్నా పత్రం అయినా,ఏ దశలోని ప్రశ్నా పత్రం అయినా పోటీ దారుకు ఉండాల్సిన మౌలిక లక్షాణాల్లో మొట్టమొదటిది పోటీతత్త్వం ( Competitive spirit), రెండోది జవాబులు రాసే నైపుణ్యం( Answering skills), మూడోది విషయ పరిజ్ఞానం( Knowledge in concern subject), నాల్గోది స్వీయ మూల్యాంకనం ( Evaluation self). ఏ అభ్యర్థినైనా పోటీలో నిలబెట్టేది, అత్యుత్తమంగా ప్రదర్శిస్తే ఉద్యోగాన్ని సాధించి పెట్టేది ఈ ’CAKE’ చతురస్రమే.

పోటీ పరీక్షల నిపుణులు చెప్పేదాన్నిబట్టి చూస్తే పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధించాలంటే 1.సన్నద్ధత (Preparation), 2. ప్రదర్శన ( Performance) అనే రెండు స్థాయిలు ముఖ్యమైనవి. ఈ రెండూ CAKE లో అంతర్భాగమే. సుప్రసిద్ధ రచయిత్రి, కాలమిస్ట్,సైకాలజిస్ట్ జాయిస్ డయాన్స్ బ్రదర్స్( 1927- 2013) చెప్పినట్టు ‘A strong, positive self-image is the best possible preparation for success‘ అనే వాక్యాన్ని, అట్లాగే ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు రాల్ఫ్ మార్స్టన్ (1907-1967) వ్యాఖ్యానించినట్టు ‘ ౄon’t lower your expectations to meet your performance. Raise your level of performance to meet your expectations. Expect the best of yourself, and then do what is necessary to make it a reality‘ అనే ప్రేరకోక్తిని ప్రతి ఉద్యోగార్థి విధిగా గుర్తుంచుకోవాలి.

ఇంతకు ముందు అనుకున్నట్టు అది ఎంత పెద్ద ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష అయినా పదిహేను నుండి ఇరవై శాతం మంది మాత్రమే దాని అసలైన పోటీదారులని అభ్యర్థులు గమనించాల్సివుంది. అప్లై చేసిన వాళ్లలో ఎనబై ఐదు శాతం మంది CAKE లో ఎక్కడో ఓ చోట కొట్టుడుపోతారు.మిగిలిన వాళ్లే అసలైన పోటీదారులు.వీళ్లే కార్యసాధకులు, లక్ష్యసాధకులు. దివారాత్రాలు కష్టపడి సాధించిన ఫలితాన్ని,వాళ్ళ అభ్యాస సామర్థ్యం లేదా అధ్యయన శీలతలో కాకుండా అదృష్టం ఖాతాలో వేయడం మనకు పరిపాటి.ఇది మనకుండే సాంప్రదాయిక దుర్లక్షణం. ప్రాప్తి,యోగం, అదృష్టం ఎల్లప్పుడూ పట్టుదల వైపు,కృషీవలుల వెంట ఉంటాయనేది అభ్యర్థులు గమనంలో ఉంచుకోవాల్సిన అతి ముఖ్యవిషయం.లక్ష్యసాధనకు ’STAR’ పద్ధతిని ఉపయోగించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు యు.ఎస్ కు చెందిన మార్క్ మట్యానోవ్స్కీ.

ఈయన Match Built అనే రిక్రూటింగ్ మరియు కెరీర్ కోచింగ్ సంస్థను నిర్వహిస్తున్నారు. STAR అంటే Situation Task Action Result అని మట్యానోవ్స్కీ ఉదాహరిస్తారు. అభ్యర్థులు ఎవరికి వాళ్లు తమ వ్యక్తిగత జీవితంలో లేదా వృత్తి జీవితంలో సాధించిన విజయాల తాలూకు ’పరిస్థితి’ని గురించి, సక్సెస్ సాధించడానికి చేయవలసిన ’పని’ గురించి,కార్య సాఫల్యానికి అమలు చేసిన, చేయాల్సిన ’చర్య’లను గురించి, ’ఫలితాలు’ కేంద్రంగా ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలంటారాయన. పోటీ పరీక్షల పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడటంతోపాటు భ్రమలనూ, వట్టి పై పై చదువరి తనాన్ని అధిగమించేందుకు ’స్టార్’ ఎవళ్లకైనా ఒక యుక్తి కారకం లేదా విముక్తి మార్గం.

సాధకులు(Achievers), పరాజితులు( Loosers) ఇద్దరూ పోటీలో చివరిదకా ఉండేవాళ్లే.సాధకుడి వర్క్ షీట్ పరాజితుడికి భిన్నంగా వుంటుంది.ఉదాహరణకు ACHIEVE అనే పదంలోనే Action (చర్య ), Common sense ( ఇంగిత జ్ఞానం), Hard work (కష్టపడటం), Imagination (అంచనా కట్టడం), Energy (శక్తి), Vision and values (దార్శనికత మరియు విలువలు),Enthusiasm (కుతూహలం) అనే సప్తాంశాలు నిభిడీకృతమై ఉన్నాయి. ఈ సప్తాంశాలు సాధకుల అమ్ముల పొదిలో భద్రంగా ఉంటాయి, ఉండాలి.అప్పుడే సక్సెస్ సాధ్యం.సక్సెస్ కు ప్రణాళిక అవసరం కూడా ఉంటుంది. అయితే రాష్ట్ర మాజీ గవర్నర్, సుప్రసిద్ధ ఆర్థికశాస్త్రవేత్త డా.సి.రంగ రాజన్ స్వీయ చరిత్ర ’ FORKS IN THE ROAD’ లో ప్రణాళికను గురించి ‘ One doesn’t plan one’s life fully. Some of it is planned, but some of purely accidental. Much of my life is matter of circumstance‘ ప్రస్తావిస్తారు. ప్రణాళిక కంటే పరిస్థితులే వ్యక్తి జయాపజయాలను నిర్ణయిస్తాయనేది రంగరాజన్ అభిమతం. అందుకని పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ప్రణాళికను రూపొందించుకొని అమలుపరచకోవడంతోపాటు మొట్టమొదటగా చేయాల్సింది పోటీవాతావరణానికి అనుగుణంగా పరిస్థితులను చక్కదిద్దుకొని నడచుకోవడమే.

పోటీ పరీక్షలకు సంబంధించిన ’2P’s ( Preperation, Performance) ల గురించి తాజా సమాచారం,శిక్షణ కోసం గతంలో కంటే off line, on line లో ఇప్పుడు అనేక ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి.తెలంగాణతోపాటు ఆయా రాష్ట్రప్రభుత్వాలూ విద్యా పోర్టల్స్ కూడా నిర్వహిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా DIKSHA, SWAYAM, Study.com, AUTODESK, Sectra , PARAKH,EUIPO ACADEMY వంటి పోర్టల్స్ విద్యా ఉపాధి శిక్షణలో విశిష్ట సేవలందిస్తున్నాయి. పోటీపరీక్షల కౌన్సెలింగ్ కొరకు Careerindia అందిస్తున్న ’10 ’టిప్స్ బాగా ఉపయోగపడనున్నాయి. పోటీ ప్రపంచం గురించి సూటిగా మాట్లాడుకోవాల్సి వస్తే ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త హెన్రీ కైజర్ చెప్పినట్టు ‘ పోటీలో ఉన్న రుచిని రుచిచూడండి.అది మీలోని ఉత్తమ ప్రతిభను వెలికితీస్తుంది‘ అనేది నా విశ్వాసం కూడా. అసలైన పోటీదారుల్లో ఎవరైతే పోటీలోని రుచి చవిచూడగరో వాళ్లే సక్సెస్ సాధించగలరనేది ఎల్లెడలా నిరూపితం.

డా. బెల్లియాదయ్య- 9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News