Monday, April 29, 2024

పెట్రోల్, డీజిల్ ద్వార రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం

- Advertisement -
- Advertisement -

Centre's Excise collections Petrol and diesel rises 88%

పెట్రోల్, డీజిల్ ద్వార రూ. 3.35 లక్షల కోట్ల ఆదాయం
గత ఏడాది 88 శాతం పెరిగిన కేంద్ర ఎక్సయిజ్ సుంకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని రికార్డు స్థాయిలో పెంచడంతో కేంద్ర ప్రభుత్వానికి వీటి ద్వారా లభించే పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి మొత్తం రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం లభించిందని ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గి అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.19.98 నుంచి రూ.32.9కి పెంచింది. అదే విధంగా డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.15.83 నుంచి రూ. 31.8కి పెంచినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు జవాబుగా లిఖితపూర్వకంగా తెలియచేశారు.ఈ పెంపుతో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ పన్ను వసూళ్లు 2020-21(ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు) రూ.1.78 లక్షల కోట్ల నుంచి రూ.3.35 లక్షల కోట్లకు పెరిగాయని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్, ఇతర ఆంక్షల కారణంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గిపోయాయని, లేనిపక్షంలో పన్ను వసూళ్లు మరింత అధికంగా ఉండేవని ఆయన చెప్పారు. 2018-19 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ పన్ను వసూళ్లు రూ. 2.13 లక్షల కోట్లు ఉన్నాయి.

కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ వరకు రూ.1.01 లక్షల కోట్ల ఎక్సయిజ్ వసూళ్లు జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో తెలిపారు. ఇందులో కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే లేదని, ఎటిఎఫ్(ఆల్కహాల్, టుబాకో, ఫైర్ ఆర్మ్), సహజ వాయువు, ముడి చమురు ద్వారా లభించే పన్నులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎక్సయిజ్ ఆదాయం రూ.3.80 లక్షల కోట్లు ఉంది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెట్రోల్ ధరలను 39 సార్లు, డీజిల్ ధరలను 36 సార్లు పెంచినట్లు తేలి తెలిపారు. అయితే, పెట్రోల్ ధరలు ఒక్కసారి, డీజిల్ ధరలను రెండుసార్లు తగ్గించినట్లు ఆయన చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరలు 76 సార్లు, డీజిల్ ధరలు 73 సార్లు పెరిగాయని మంత్రి తెలిపారు.

Centre’s Excise collections Petrol and diesel rises 88%

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News