Saturday, April 27, 2024

మైమరపిస్తున్న మెలోడీ గీతం

- Advertisement -
- Advertisement -

Cheppake Cheppke song released from Maha Samudram

 

‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, – బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి, – అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలోని ‘చెప్పకే చెప్పకే’ అనే మెలోడీ గీతాన్ని రష్మిక మందన్నా రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ సమకూర్చిన బాణీలకు.. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. గాయని దీప్తి పార్థసారధి వాయిస్ ఆహ్లాదకరంగా వినసొంపుగా ఉంది. ఈ పాటను అదితి రావు హైదరి మీద చిత్రీకరించినప్పటికీ.. ఇందులో శర్వానంద్, – సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News