Friday, May 17, 2024

ఏ1గా ఆయుధాల కేసులో చీకోటి ప్రవీణ్

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: బోనాల పండగ రోజు లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి దేవాలయం వద్ద చీకోటి ప్రవీణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గన్లతో ఆలయంలోకి వెళ్ళే క్రమంలో వారిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఛత్రినాక పోలీసులకు అప్పగించటంతో ముగ్గురు గన్‌మెన్లపై కేసు నమోదు చేసి వారి వద్ద గన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా చీకోటి ప్రవీణ్‌ను ఏ1గా చేర్చి కేసు సెక్షన్లను మార్చారు.

ఆదివారం గన్‌మెన్లపై క్రైమ్ నెంబర్ 223/2023లో సెక్షన్లు 420, 467, 468, 471 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన విషయం తెలసిందే. ఆ కేసును సోమవారం మార్చారు. సెక్షన్లను తాజాగా 420, 109ఆమ్స్ యాక్ట్, 25, 30 నమోదు చేశారు. ఏ1గా చీకోటి ప్రవీణ్, ఎ2గా సుందర్ నాయక్, ఏ3గా రమేష్‌గౌడ్, ఏ4గా రాకేష్‌కుమార్‌లుగా పేర్కొన్నారు. కాగా ఏ1 చీకోటి ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు చూపించారు. మిగిలిన ముగ్గురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News