Monday, April 29, 2024

లంక సరిగ్గా స్పందిస్తేనే రుణాలు: చైనా

- Advertisement -
- Advertisement -

China ducks Lanka debt restructuring requests

కొలంబో / బీజింగ్ : తమ రుణాల పునర్వస్థీకరణకు లంక చేసిన అభ్యర్థనపై చైనా స్పందించింది. తుది నిర్ణయం తీసుకునే బాధ్యత లంకపైనే ఉందని, బాల్ ఇప్పుడు వారి కోర్టులో ఉందని ఆదివారం తెలిపింది. రుణాల చెల్లింపుల కాలాన్ని మార్చివేసి తిరిగి రుణాలకు అవకాశం ఇవ్వడంపై స్పందించాల్సి ఉందని చైనాను లంక కోరింది. తీవ్రస్థాయి ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ ఉన్నందున రుణాల పునర్వస్థీకరణ అత్యవసరం అని తెలిపింది. ఈ ఏడాది చైనాకు లంక 1.5 బిలియన్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్ల వరకూ రుణాల బాకీ పడి ఉంది. మొత్తం మీద చైనా రుణాలు పెట్టుబడులవిలువ గత కొద్ది సంవత్సరాలలో చూస్తే 8 బిలియన్ డాలర్లు దాటింది. ఇప్పటికీ రుణాల విషయంలో తమ వైఖరి స్పష్టంగానే ఉందని, అయితే లంకనే పూర్తిస్థాయిలో నిబంధనలు ఇతర విషయాలలో సరిగ్గా స్పందించడం లేదని చైనా అధికార వర్గాలు తెలిపినట్లు మిర్రర్ పత్రిక తెలిపింది. లంక ఆర్థిక మంత్రిత్వశాఖకు తమ ప్రతిపాదనలు పంపించామని అయితే సరైన సమాధానం రాలేదని, పైగా ముందు తాము ఐఎంఎఫ్‌తో ఒప్పందాలు ఖరారు చేసుకుంటామని నివేదించిందని బీజింగ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News