Monday, April 29, 2024

చిప్‌సెట్ కొరతతో కుదేలవుతున్న స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ

- Advertisement -
- Advertisement -
cipset
chipset

న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమను దెబ్బతీస్తోందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనే పరిశోధన సంస్థ అభిప్రాయపడింది. 2021లో స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతి 1.4 బిలియన్లు ఇందని ఆ సంస్థ తెలిపింది. ఇది దాదాపు 6 శాతం వృద్ధి అని చెప్పవచ్చు కానీ ఇదివరకటి సంవత్సరపు 9శాతం వృద్ధితో పోల్చినప్పుడు తక్కువేనని చెప్పాలి.

“సెమీకండక్టర్ల కొరత కారణంగా శాంసంగ్, ఒప్పో, జియోమి ఫోన్ కంపెనీలు బాగా ప్రభావితం అయ్యాయి. అయితే ఆపిల్ ఫోన్‌లపై దీని ప్రభావం అంతగా లేదనే చెప్పాలి” అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ టామ్ కాంగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News