Monday, April 29, 2024

ఆర్మీ డ్రెస్ లో చిరు, చరణ్.. ‘ఆచార్య’ లోకేషన్ పిక్ వైరల్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి అడవుల్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇల్లందులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవితోపాటు చరణ్ కూడా పాల్గొంటున్నాడు. అయితే, ఆచార్య లొకేషన్ లో ఆర్మీ డ్రెస్ లో ఉన్న చిరు, చరణ్ ల పిక్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ రెండోసారి హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ఆచార్య మూవీ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Chiru and Ram Charan’s new pic viral from ‘Acharya’ Set

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News