Thursday, May 9, 2024

కొంతమందితో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం

- Advertisement -
- Advertisement -

24 ఏండ్ల క్రితం తాను ఒక్కడినే బయలుదేరి ఉద్యమంలోకి వెళ్ళానని సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ఆనాడు నిస్పృహ, నిస్సహాయత ఉండేదని, కానీ ఎం చేయాలో తెల్వని పరిస్థితి ఉండేదని తెలిపారు. శుక్రవారం శామీర్‌పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ గజ్వెల్ కార్యకర్తల ప్రత్యేక సమావేశానికి కెసిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్ మదుసూదనా చారి, బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… అన్ని రంగాల్లో అభివృద్ధి జాడలు లేక, ఎక్కడ చూసినా చిమ్మని చీకటి, ఎవరిని కదిలించినా మనోవేదనే ఉండేదని నాటి ఉమ్మడి రాష్ట్రంలోని మెదక్ జిల్లా తెలంగాణ పరిస్థితులను సిఎం గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి పాలనలో మంజీర నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసినా నీళ్లు రాకపోయేవని, అప్పుడు ట్రాన్స్‌ఫార్మర్స్ కాలిపోతే ఒక్కో బాయికి రూ. రెండు వేలు, రూ.మూడు వేలు వేసుకొని బాగుచేయించే పరిస్థితి ఉండేదని సిఎం కెసిఆర్ చెప్పారు.

కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి ఆనాడు చంద్రబాబు మోసం చేశారని, ఇక లాభం లేదని, చూస్తూ చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని కెసిఆర్ గుర్తు చేశారు. కొంతమందితో కలిసి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి పోరాడి చివరకు తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో అభివృద్ధి చేసుకున్నామని, సాధించిన దానికే సంతృప్తిని చెంది ఆగిపోవద్దని పేర్కొన్నారు. శ్రేష్టత కోసం తపన పడడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగిన నాడే గుణాత్మక జీవన విధానం ప్రజలకు అందించగలమని తెలిపారు. ఈ పదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో మనందరం గమనించాల్సింది అదేనని సిఎం వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News