Monday, April 29, 2024

అదే తెగింపు… అదే దూకుడు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చుతున్న కేంద్రంపైనే యుద్ధం
కమలనాథులు తమ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేస్తారని తెలిసి పోరుబాట
దేశరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతవరకైనా వెళ్తానని ప్రతిజ్ఞ
అంతుచిక్కని కెసిఆర్ మిషన్ మోడ్
మెరుపువేగంతో వేసే ఎత్తులకు ప్రత్యర్థులు చిత్తు 
ఆయన మాస్టర్ స్ట్రోక్‌లే తమ విజయాలకు సోపానమని విశ్వసిస్తున్న పార్టీ వర్గాలు

మన తెలంగాణ/హైదరాబాద్: దూకుడు, తెగింపు, మడమ తిప్పని గుండె ధైర్యం అదే ఆయన ఫార్ములా. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ, నేడు మోడీతో యుద్ధంలోనూ ముఖ్యమంత్రి కెసిఆర్ అదే ఫార్ములాను అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే ఆయన విజయ రహస్యంగా మారినట్లు గడిచిన రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇప్పుడు కెసిఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై ధర్మ యుద్ధం ప్రకటించారు. ఇది ఎంతవరకు వెళ్లినా వెనకడుగు వేసేది లేదని ఆయన భీషణ ప్రతిజ్ఞ చేశారు. దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలంగాణ తరహాలోనే దేశంలో కూడా మరో ఉద్యమం రావాల్సి ఉందని, అది తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని కెసిఆర్ తన శ్రేణులకు మూడు రోజుల క్రితం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పిలుపునిచ్చారు. కేంద్రంలో పూర్తి మెజారిటీతో తిరుగులేని అధికారం చలా యిస్తూ తన ప్రభు త్వం పట్ల, విధానాల పట్ల, సిద్ధాంతాల పట్ల వ్యతి రేకత ప్రదర్శించే ప్రభుత్వాలను కూలగొడు తున్న మోడీనే కెసిఆర్ ఢీ కొంటున్నారు. దీనికితాను, తన పార్టీ వాళ్లు పలు సవాళ్లు ఎదు ర్కొంటారని కెసి ఆర్ కు తెలుసు. కేంద్రంలోని పెద్దలు తన ప్రభుత్వాన్ని అష్ట దిగ్బంధనం చేస్తారని కూడా ఆ యనకు తెలుసు.

అయినా, కేం ద్రంలోని బిజెపితో తాడోపేడో తేల్చుకునేందుకు సమర శంఖాన్ని కెసిఆర్ పూరించారు. కేంద్రం తెరవెనక వ్యూహాలతో దేశంలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టింది. మరో ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు చేస్తూ రాష్ట్రంలో పోలీసులకు కేంద్రం ఏజెంట్లు దొరికిపోయారు. అయినా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కెసిఆర్ కేంద్రంతో ప్రత్యక్ష ఘర్షణకు దిగడం పట్ల పార్టీలోని నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం దూతలు అదే పనిగా రాష్ట్రానికి చెందిన టిఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేస్తారని, అనేకానేక కేసులు పెడతారని చెబుతున్నా కెసిఆర్ లెక్క చేయకుండా కేంద్రంపై పోరాట పంధాను ఎంచుకోవడం సాధారణ విషయం కాదని ఆ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇలాంటి దూకుడు నిర్ణయాలే తమ విజయాలకు సోపానాలుగా మారుతున్నాయని, మారబోతాయని మరోవైపు ధీమాగా ఉన్నారు. ఓటుకు నోటు కేసులో టిడిపి హయాంలో రేవంత్ రెడ్డిని లంచం డబ్బుతో రెడ్ హ్యాండెడ్‌గా పూర్తి ఆధారాలతో పకడ్బందీగా పట్టించిన రీతిలోనే కెసిఆర్ తన ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు చేసిన బిజెపి దళారులను ఆడియో, వీడియో సాక్షాలతో సహా పట్టించి దేశ ప్రజల ముందు తన వ్యూహాలు, ఎత్తులు ఎలా వుంటాయో చాటి చెప్పారని ఆ వర్గాలు చెబుతున్నాయి.

అప్పటి టిడిపి నేత రేవంత్ ఎపిసోడ్‌తో ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణను విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యే పరిస్థితిని తన వ్యూహ చతురుతతో కెసిఆర్ తీసుకువచ్చారని టిఆర్‌ఎస్ వర్గాలు విశ్లేషిస్తునాయి. చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్న రాజమౌళి తన సినిమాల్లో విలన్‌ను బలవంతుడిగా చూపిస్తూనే అంతటి బలశాలిపై బుద్ధిబలంతో హీరో విజయం సాధించే తీరు, దాన్ని ఆయన తెరకెక్కించే విధానం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అదే రీతిలో రాజకీయాల్లో తనకు బలమైన ప్రత్యర్థిగా వున్న ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కొని విజయం సాధించి ఢిల్లీలో జెండాను ఎగుర వేయాలని కెసిఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారని పార్టీ పరిశీలకులు అంటున్నారు.

కెసిఆర్ మిషన్ మోడ్‌ను ఎవరూ ఊహించలేరని, విజయ తీరాలకు చేరే వరకూ ఆయన ఎత్తుగడలు ఆయన మనసుకు తప్ప మరొకరికి తెలిసే అవకాశమే లేదని చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తీసుకున్న దూకుడు నిర్ణయాలను ఈసందర్భంగా ఆ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్ళు, నిధులు, ఉద్యోగాల విషయంలో జరిగిన అన్యాయాన్ని సహించలేక ఆయన 2001లో తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్, ఎంఎల్‌ఎ, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కూడా తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక నాటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నుంచి ఆ తరువాత యుపిఎ ప్రభుత్వం నుంచి పదవులను గడ్డిపోచలుగా వదిలేసి కార్యక్షేత్రంలోకి దిగారు. ఇలాంటి అనూహ్య, సాహస నిర్ణయాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తా యో అని ఆయన సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేసే వారు.

ఒకవేళ తెలంగాణ రాకపోతే కెసిఆర్ భవిష్యత్ ఏమిటని ఆయన అభిమానులు అంతర్మథనం చెందేవారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ హయాంలో కూడా తెలంగాణ వచ్చే సూచనలు కనిపించకపోవడంతో కెసిఆర్ చివరి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. అదే నవంబర్ 29న అమరణ దీక్షను ప్రారంభించి మొత్తం తెలంగాణను స్తంభింపజేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తెలంగాణవ్యాప్తంగా పరిస్థితులు దారి తప్పడంతో కేంద్రం 11రోజుల తరువాత డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. ఆ తరువాత చరిత్ర అందరికి తెలిసిందే. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లకు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారు. ఇది కూడా ఎవరూ ఊహించలేదు. ఇవన్నీ కెసిఆర్ మార్క్ మాస్టర్ స్ట్రోక్‌లు. ఇవన్నీ ఆయన తెగింపునకు నిదర్శనాలు. కెసిఆర్ గడిచిన రెండు దశాబ్ధాలుగా తీసుకున్న అనేక సంచలన, సాహస నిర్ణయాలు పార్టీకి లాభం చేకూర్చాయే తప్ప నష్టం కలిగించలేదు. కేంద్రంతో ప్రత్యక్ష ఘర్షణ కొన్ని సమస్యలు తెచ్చినా అంతిమంగా పార్టీకి లాభం జరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు.

ఇటీవల జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై కూడా ఇడి దాడులు ఉంటాయని హెచ్చరించారు. అంటే బిజెపిపై తాను తలపెట్టిన యుద్ధానికి అంతా సంసిద్ధం కావాల్సిందనే సంకేతాలు ఆయన ఈ సందర్భంగా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో చేసిన ప్రసంగం ఆషామాషీగా లేదు. మోడీ నేరుగా కెసిఆర్ పేరు ప్రస్తావించకపోయినా ఆయన కూడా తెలంగాణే తమ టార్గెట్ అన్నట్లుగా మాట్లాడారు. ఇక ముందుంది అంతా అంటూ బల్లగుద్ది మరి ప్రతి సవాల్ చేశారు. దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల వరకు బిజెపి, టిఆర్‌ఎస్ మధ్య ఇదే వేడి వాతావరణం నెలకొనే అవకాశాలున్నాయి. అయితే కేంద్రంతో ప్రత్యేక ప్రత్యక్ష ఘర్షణకు దిగడానికి కెసిఆర్‌కు కారణాలు కూడా లేకపోలేదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం, జిఎస్‌టి భారం, మత పరమైన ఉద్రిక్తతలతో జనాభాలోని మెజారిటీ పేద, మధ్యతరగతి వర్గం ఆగ్రహంగా ఉన్నది.

ఈ వర్గాలు తమ జీవనానికి ఆటంకంగా మారిన విధానాలను మోడీ అనుసరిస్తున్నారని ఆ వర్గాలు అనుకొంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో మోడీపై ఆగ్రహం ఓట్ల రూపంలో పెల్లుబికే అవకాశం ఉందని కెసిఆర్ అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగేలోపు మోడీ టిఆర్‌ఎస్‌ను కూడా చీల్చే వ్యూహాలను అమలు చేస్తూ అవసరమైతే ఇడి, సిబిఐ, ఐటీలను కేంద్రం ప్రయోగించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఊహిస్తున్నారు. కొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకుంటున్నారు. అయినా వెనకడుగు వేసేది లేదంటూ పార్టీ శ్రేణులకు మనోధైర్యాన్ని నూరిపోస్తూనే ఒకవేళ కేంద్రం అరెస్టుల దాకా వెళ్లితే దానినే బ్రహ్మాస్త్రాలుగా మలుచుకొని ఎన్నికలకు వెళ్ళవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. తెలంగాణలో టిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంతోపాటు దేశంలో టిఆర్‌ఎస్‌ను జాతీయ స్థాయిలో బలోపేతం చేయాలనే లక్షంతో కెసిఆర్ ముందుకు వెళ్తున్నారు. ఇటు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు, దేశంలో కూడా టిఆర్‌ఎస్‌ను జాతీయ శక్తిగా మార్చాలనేవి ఆయన తక్షణ వ్యూహాలుగా ఉన్నాయి.ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉపయోగించిన రాజీనామాలు, ఆమరణ దీక్షలు లాంటి మొండి వైఖరులే ప్రత్యేక తెలంగాణను తెచ్చిపెట్టాయి. అదే రీతిలో కేంద్రంపై ఇప్పుడు యుద్ధం చేయాలని కెసిఆర్ శ్రేణులకు పిలుపు నిస్తున్నారు.

CM KCR Meeting with Party Leaders

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News