Saturday, April 27, 2024

పాలనాసౌధంపై ప్రత్యేక శ్రద్ధ

- Advertisement -
- Advertisement -

కొత్త సచివాలయం చూపరులను అబ్బురపరిచాలి
పచ్చదనంతో కళకళలాడాలి
అన్ని హంగులు, సకల సౌకర్యాలకు నిలయంగా ఉండాలి
సమీకృత సచివాలయం నమూనాపై ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ సమీక్ష

CM KCR

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్త సచివాలయాన్ని చూడగానే చూపరులను అబ్బురపరిచాలి. ప్రాంగణమంతా పచ్చదనం పరవాలి. మొత్తంగా సచివాలయం సమున్నతంగా ఉండేలా సమీకృత సచివాలయం నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిలాషించారు. ఈ నూతన సచివాలయ భవనాన్ని సకల హంగులు, అన్ని సౌకర్యాలకు నిలయంగా ఉండాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో పాత సచివాలయం కూల్చివేతలతో పాటు కొత్త సచివాలయం నమూనాపై సిఎం కెసిఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేమూరి ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, చైన్నైకు చెందిన ఆర్కిటెక్చర్లు ఆస్కార్, పొన్నిలతో పాటు పలువురు ఆర్కిటెక్చర్లతో సమావేశమయ్యారు. నూతన సచివాలయ నిర్మాణంపై ఇప్పటికే రెండు పర్యాయాలు నిర్వహించిన సమీక్షలో సిఎం చేసిన పలు సూచనలపై ఆర్కిటెక్ట్ బృందం మేధోమథనం చేసి కొత్త నమూనాను రూపొందించింది. దీనిపై సిఎం కెసిఆర్ ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా నిర్మించే సచివాలయం దేశానికే తలమానికంగా ఉండలన్నారు.

అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడే విధంగా నూతన సచివాలయం ఉండాలన్నారు. ముఖ్యంగా సిఎం కార్యాలయంతో పాటు మంత్రుల కార్యాలయాలు ఏ దిక్కున ఉండాలి? ఎంతెంత విస్తీర్ణంలో ఉండాలి? తదితర అంశాలపై కూడా అధికారులతో సిఎం కెసిఆర్ చర్చించారు. కాగా ఈ సమావేశంలో కూడా సిఎం మరిన్ని సూచనలు, సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మార్పులు, చేర్పుల క్రతువు సింహభాగం పూర్తి అవుతందని సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ప్రముఖ ఆర్కిటెక్చర్లు ఆస్కార్, పొన్నిలు ఇచ్చిన నమూనాకు సిఎం కెసిఆర్ దాదాపుగా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే అందులో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సిఎం సూచనలకు అనుగుణంగా అధికారులు, ఆర్కిటెక్చర్లు పలు మార్పులు చేసి నూతన నమూనాను రూపొందించారు. దీనిపై మరికొన్ని మార్పులు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఒకటి, రెండు రోజుల్లో సచివాలయం నమూనా ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. తదనంతరం పాత సచివాలయం కూల్చివేతల పురోగతి పనులపై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా జె. ఎల్ బ్లాకులకు కూల్చివేతలకు ముంబై నుంచి ప్రత్యేకంగా జైజాంటిక్(భారీ) టాటా హిటాచీ యంత్రంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులు సిఎం దృషికి తీసుకొచ్చారు. నేటి (శనివారం) యంత్రం కల్లా కూల్చివేతలు దాదాపుగా పూర్తి అవుతాయని వివరించారని తెలుస్తోంది.

CM KCR Review on New Secretariat building

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News