Wednesday, May 1, 2024

పివి కీర్తి శిఖరంలాంటిది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కలాలతో గళాలతో పివి శతజయంతి ఉత్సవాలు జరిపిన వారందరికీ కృతజ్ఞతలు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మాజీ ప్రధాని పివి శత జయంతి ఉత్సవాలను నిర్విరామంగా నిర్వహించడంలో విజయం సాధించిన ఎంపి కె.కేశవరావును అభినందిస్తూ సిఎం కెసిఆర్ జ్ఞాపికను బహుకరించారు. పివి ఘాట్‌లో మాజీ ప్రధానమంత్రి పివి నర్సింహరావు శతజయంతి ముగింపు ఉత్సవాలు సందర్భంగా పివి కాంస్య విగ్రహాన్ని కెసిఆర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. పివిని మనం ఎంత సన్మానించుకున్నా తక్కువే అని అన్నారు. పివి నరసింహారావు కీర్తి శిఖరం, దీపస్తంభంలాంటిదని, ఎక్కడ ఏ పాత్ర పోషిస్తే అక్కడ సంస్కరణ తీసుకొచ్చారని కొనియాడారు. విద్యారంగంలో పివి తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటికీ పరమళిస్తున్నాయని, పివి తీసుకొచ్చిన అనేక సంస్కరణలు మన కళ్ల ముందే ఉన్నాయని, భూ సంస్కరణలు పివి స్థానంలో వేరేవాళ్లుంటే జరిగేవి కావని కెసిఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల సిఎం నేర్చుకునే విధంగా భూసంస్కరణలు చేసిన ఘనత పివిదన్నారు.

గొప్ప వ్యక్తిత్వ పటిమి కలిగిన నాయకుడు పివి అని కెసిఆర్ ప్రశంసించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకొని అనేక పరిణామాలు చూస్తూ ధ్యుతి, ఉధృతి పరిశీలిస్తూ సంస్కరణలు చేసిన వ్యక్తి పివి అని పొగిడారు. 800 ఎకరాల పివి సొంత భూమిని ధారాదత్తం చేసి భూసంస్కరణలు చేసిన గొప్ప మార్గదర్శి పివి అని, పివి నరసింహారావు ఒక సవాల్‌గా తీసుకొని మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపిన ప్రజ్ఞాశీలి అని, కాకతీయ యూనివర్సిటీలో పివి పీఠం ఏర్పాటు చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. పివికి ఘనమైన నివాళి అర్పించే క్రమంలో పివి కూతురు వాణీదేవిని ఎంఎల్‌సి గెలిపించుకున్నామని, చరిత్రలో పివి శతజయంతి ఉత్సవాలు నిలిచిపోయేలా విజయవంతంగా జరిపిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News