Monday, May 6, 2024

తొలిసారి జెండా ఎగిరేసినప్పుడు అపోహలు, అపనమ్మకాలు ఉండేవి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తొలిసారి పార్టీ జెండా ఎగిరేసినప్పుడు ఎన్నో అపోహలు ఉండేవని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆనాడు విపరీతమైన అపనమ్మక స్థితి ఉందని, గమ్యం మీద స్పష్టత లేని అగమ్యగోచర పరిస్థితి ఉందని, ఉద్యమం మీద అప్పటికే లేనిపోని అపోహలు ఉన్నాయని, ఎన్నో అపనమ్మకాల మధ్య గులాబీ జెండా ఎగిరిందన్నారు. అధినేత సిఎం కెసిఆర్‌కు ప్రతినిధుల సభ శుభాకాంక్షలు తెలిపింది. టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తనని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సిఎం కెసిఆర్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేదా? అని ఆ రోజు పిలుపునిచ్చానని గుర్తు చేశారు. రాజ్యసభలో బిల్లు పాసయ్యేనాడు కూడా ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, ఎట్టకేలకు విజయతీరాలకు చేరి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఉద్యమం గురించి ఒకసారి సింహావలోకనం చేసుకోవాలని, తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకే ఒక కొత్త భాష్యాన్ని చెప్పిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుందని తెలిపారు. తెలంగాణ వస్తే కారు చీకట్లు ముసురుకుంటాయని అపోహలు సృష్టించారని, తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని ఎగతాళి చేశారన్నారు. పరిశ్రమలు తరలిపోతాయని దుష్ప్రచారం చేశారని కెసిఆర్ మండిపడ్డారు. ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని మూడు కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News