Wednesday, May 1, 2024

నాయినిని చూసి కన్నీరు పెట్టుకున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించి ఆయన కుటుంహసభ్యులకు ధైర్యం చెప్పారు. అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉన్న నాయినినర్సింహారెడ్డి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. నాయిని పరామర్శించేందుకు వెళ్లిన సిఎం కెసిఆర్ నాయిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. కంటనీరు వస్తుండగానే ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. సిఎం కెసిఆర్‌తో పాటుగా రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని సిఎం కెసిఆర్ వైద్యులను కోరారు. సెప్టెంబర్ 28న నాయినికి కరోనాసోకగా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరిచికిత్సపొందారు. ఆతర్వాత వైద్యపరీక్షల్లో నెగటివ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల సమస్యతో శ్వాసతీసుకోవడం కష్టంగా మారడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే క్రమేణ ఆరోగ్యం క్షీణించడంతో రాష్ట్ర సిఎం కెసిఆర్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించి మరింత మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News