Monday, April 29, 2024

అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సిఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి : డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న నిరుద్యోగ నేత అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. పోలీసు నిర్భంధంలో మూడు రోజులుగా చైతన్యపురిలోని తన నివాసంలో ఆమరణ నిరహారదీక్షకు సంఘీభావం తెలిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన తెలిపితే ప్రభుత్వం నిర్భంధం విధిస్తుందని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే గురుకులల్లో 3 వేల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయన్నారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో రిలింక్విష్‌మెంట్ విధానాన్ని పాటిస్తే ఖాళీలు మిగిలేవి కావన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకుల ఉద్యోగాలను అవరోహన క్రమంలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్న జీవో నెం.46 ను తక్షణమే రద్దుచేయాలని, గ్రూప్-1,2,3 పోస్టులను ప్రస్తుతం ఉన్న ఖాళీలకు అనుగుణంగా పెంచి,నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. టెట్ నిర్వహించిన తరువాత డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల డిమాండ్లు సాధనకోసం బిఎస్పీ నిరుద్యోగుల గొంతుకై ప్రశ్నిస్తుందని తెలిపారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News