Saturday, April 27, 2024

ఆ సీనియర్ నటుల దగ్గర చాలా నేర్చుకున్నా

- Advertisement -
- Advertisement -

ఎం.ఆర్. పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్పణలో ఎల్.పద్మనాభ నిర్మించిన చిత్రం ‘కాలేజ్ కుమార్’. కన్నడంలో ఘన విజయం సాధించిన ఈ మూవీతో తెలుగులో హరి సంతోష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రాహుల్ విజయ్‌తో ఇంటర్వ్యూ…
అందుకే ఈ టైటిల్…
‘కాలేజ్ కుమార్’ టైటిల్ క్యాచీగా అనిపించింది. అందుకే సినిమాకు ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశాం. కన్నడంలో ఈ సినిమా ‘కాలేజ్ కుమార్’ టైటిల్‌తో విడుదలై పెద్ద సక్సెస్ అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది.
ఆ సన్నివేశాలు హైలైట్‌గా…
సబ్జెక్ట్ నచ్చి ఈ సినిమాను తెలుగులో చేశాం. బేసిక్ లైన్ తీసుకొని తెలుగులో మన నేటివిటీకి తగ్గట్లు చేశాం. తండ్రి,కొడుకుల మధ్య సన్నివేశాలు సినిమాలో మెయిన్ హైలెట్‌గా ఉంటాయి.
ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా…
ప్రస్తుతం ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మన చదువుకు తగ్గట్లు జాబ్ చేయడం… వంటి విషయాలు ఈ సినిమాలో చర్చించడం జరిగింది. డైరెక్టర్ సంతు కన్నడలో సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఆయనే మళ్లీ తెలుగులో డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను మలచడం జరిగింది.
వారి దగ్గర చాలా నేర్చుకున్నా…
మధుబాల, నాజర్, రాజేంద్ర ప్రసాద్‌లతో కలిసి పనిచేయడం సంతోషంగా అనిపించింది. ఈ సీనియర్ నటుల దగ్గర చాలా నేర్చుకున్నాను. సినిమా షూటింగ్ అంతా చాలా సరదాగా జరిగింది. సినిమా ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని నమ్ముతున్నాను.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం ‘బ్లాక్ అండ్ వైట్’ అనే థ్రిల్లర్ చేస్తున్నాను. కొత్త దర్శకుడు ఈ సినిమా చేస్తున్నాడు. మరో రెండు ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి.

College Kumar Hero Rahul Vijay special Interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News