Monday, April 29, 2024

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర పెంపు.. జెట్ ఇంధనమూ భారమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.101కి పెంచాయి. అంతకు ముందు కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి వాణిజ్య సిలిండర్ ధర రూ.250 మేర పెరిగింది. అక్టోబర్‌లో మరో రూ. 200 పెంచారు. ఇప్పుడు ఇంకో రూ. 100 పెంచడంతో ఇటీవల తగ్గింపుతో లభించిన ఉపశమనం ఆవిరైనట్లయింది. తాజా పెంపుతో కలిపి దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ . 1833 కు చేరింది.

అంతకు ముందు ఇది రూ. 1732 గా ఉండేది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో రూ. 1999.50 కి, పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో రూ. 1943,ముంబైలో రూ. 1785.50 కి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. పెంచిన కొత్త ధరలు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కిల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం మారలేదు. ఆగస్టు 30న వీటి ధరను రూ. 200 వరకు తగ్గించారు.

జెట్ ఇంధన ధరల్లోనూ పెంపు
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలే కాక, విమాన ఇంధన ధరల (ఎటిఎఫ్ ప్రైస్)ను కూడా చమురు విక్రయ సంస్థలు పెంచాయి. ఒక్కో కిలో లీటరుపై అదనంగా మరో రూ.1074 భారం వేశాయి. దాంతో ఢిల్లీలో కిలో లీటర్ ఎటిఫ్ ధర రూ.1,11,344.92 కు చేరింది. ఇలా జెట్ ఇంధనం ధర పెరగడం గత ఐదు నెలల్లో ఐదోసారి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం గత 19 నెలలుగా ఎటువంటి మార్పు లేదు. కాగా, ప్రతినెలా 1వ తేదీన వంటగ్యాస్‌తోపాటు ఏటీఎఫ్ ధరలను ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు ప్రతినెల సవరిస్తుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News