Thursday, May 16, 2024

నటుడు సూర్యపై కోర్టులో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Surya
చెన్నై: జై భీమ్ సినిమాకు సంబంధించి క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్య చేపట్టకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు వన్నియార్ సంఘానికి చెందిన అరుల్‌మొళి తెలిపారు. వన్నియార్ సముదాయం ప్రతిష్టను కళంకితం చేసిన నటుడు సూర్య, దర్శకుడు టిజె జ్ఞానవేల్ చర్య చేపట్టాలంటూ తమిళనాడులోని చిదంబరంలో ఉన్న సెకండ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో వన్నియార్ సంఘం అధ్యక్షుడు పు థా అరుల్‌మొళి ప్రైవేట్ కంప్లయింట్ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో ప్రథమ నిందితులుగా(అక్యూజ్డ్) ప్రొడక్షన్ హౌస్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్, రెండో నిందితులుగా నటుడు సూర్య, మూడో నిందితులుగా ఆయన భార్య జ్యోతిక, నాలుగో నిందితులుగా జ్ఞానవేల్, ఐదో నిందితులుగా అమేజాన్‌లను పేర్కొన్నారు.

సూర్య మీద చర్య చేపట్టాలని అరుల్‌మొళి కోరారు. ఆయన తీసిన సినిమా శాంతి సామరస్యాలను దెబ్బతీసేదిగా, కుల ఘర్షణలకు తావిచ్చేదిగా ఉందని పేర్కొన్నారు. పోలీసులకు క్రిమినల్ కంప్లయింట్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సినిమాలో వన్నియార్ సముదాయాన్ని నీచంగా చూయించే ప్రయత్నంచేశారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇతర కులాలు, వర్గాలకు చెందిన వారు వన్నియార్లకు ఓ మంచి దృష్టితో చూసేవారని, దానిని సినిమా ద్వారా అప్రతిష్టపరిచేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. సినిమా తీసిన వారికి దురుద్దేశాలున్నాయన్నారు. వన్నియార్లు తప్పుడు, అక్రమ పనులు చేసేవారిగా సినిమాలో చిత్రీకరించారని, నిజానికి వాస్తవిక జీవితంలో ఆ సినిమాలో చూపిన ఇన్‌స్పెక్టర్ వన్నియార్ సముదాయానికి చెందిన వాడే కాదన్నారు. అవసరంలేకున్నా సినిమాలో కావాలనే వన్నియార్ కుల సంఘం చిహ్నాన్ని వాడారని పేర్కొన్నారు. ‘అగ్ని కుండం’ చిహ్నాన్ని చూయించారన్నారు. ప్రజల దృష్టిలో ఈ సినిమా ద్వారా వన్నియార్లను అప్రతిష్టపాలుచేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News