Monday, April 29, 2024

దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..
రాహుల్‌గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు
దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే
కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
సత్యాగ్రహ దీక్షలో కేంద్రంపై నిప్పులు చెరిగిన హస్తం పార్టీ సీనియర్ నాయకులు

మన తెలంగాణ/హైదరాబాద్ ః దేశ ప్రజలంతా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని, బిజెపి నాయకులు ఎన్ని జిమ్మికులు చేసిన మోడీ, అమిత్‌షాలు ఇంటిదారి పట్టాల్సిందేనని ఆపార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆపార్టీ నాయకులు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. బుధవారం ఆపార్టీ సీనియర్ నాయకులు కేంద్రంలో నరేంద్రమోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యలను రోజు రోజుకు దిగజారుస్తూ కార్పొరేట్ వ్యవస్ధలను బలోపేతం చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఈసందర్భంగా ఏఐసీసీ ఇంచార్జీ మానిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తుందని, రైతు డిక్లరేషన్‌లో తమ పార్టీ ఏమి చెప్పిందో అవి అమలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసి బిజెపి ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టేందుకు కుట్రలు చేస్తుందని వారు ఎన్ని ఎత్తులు వేసిన దేశ ప్రజలు కాంగ్రెస్‌వైపు ఉన్నారని పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్సీ సభ్యులు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాహుల్ గాంధీ దేశంలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళను దృష్టిలో పెట్టుకొని నాలుగు సంవత్సరాల క్రితం మాట్లాడిన సంఘటన ఆరోపణలకు పూర్తి శిక్షకాలమే 2 సంవత్సరాలు కానీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు మాత్రమే కాదు 6 సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేయకుండా కుట్రపన్నారని మండి పడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాను టాటాకి మోడీ అప్పగించాడని, రాహుల్ గాంధీ హిదెన్ బర్గ్ ఆరోపణలపై ప్రశ్నించినందుకు పార్లమెంట్‌లో ఉండకుండా చేయాలని ఎత్తుగడలు చేశారని ఆరోపించారు. ప్రాణ త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, యూపిఏ హయాంలో ప్రధాని అవకాశం వచ్చిన మన్మోహన్‌కి ఇచ్చిన ఘనత గాంధీ కుటుంబానిదని ఉచిత విద్యుత్ విషయం లో పిపిఏ ఒప్పందం లో వేల కోట్ల అవినీతి జరిగిందని మా పిసిసి అంటే వక్రీకరించడం సరికాదన్నారు.

ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బిజెపికి భయం ః మల్లు రవి
కేంద్రంలో ఇప్పడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు భావిస్తున్నారని ప్రజాస్వామ్యం నిలబడాలంటే హస్తం పార్టీ అధికారంలోకి రావాలని దేశమంతా కోరుకుంటుందని పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి పేర్కొన్నారు. చిన్న తప్పుకు రెండు సంవత్సరాల శిక్ష వేపి తీర్పు వచ్చిన వెంటనే పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి, ఇల్లు ఖాళీ చేయించారని మండిపడ్డారు. రాహుల్ పై జరుగుతున్న పరిణామాల వెనక మోడీ, షా లు ఉన్నారని ఆరోపించారు. ఆయనకు మద్దతుగా కేంద్ర బీజేపీ విధానాలు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సత్యాగ్రహ మౌన దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ఎంతమంది ఏకమైన వచ్చిన ఎన్నికల్లో కేంద్రంలో 300 స్థానాలు సాధించి కాంగ్రెస్ అధికారం చేపడుతోందని, కర్ణాటకలో గెలిచాం, తెలంగాణలో సైతం విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా, సమానత్వాలు కలిగించింది కాంగ్రెస్ పార్టీనే ః మధు యాష్కీ గౌడ్
దేశంలో ప్రజలకు స్వేచ్చా, స్వాతంత్రం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని, సూరత్ కోర్ట్ జడ్జిమెంట్ తరువాత హైకోర్టుకు వెళ్ళామని 66 రోజులు పెండింగ్‌లో పెట్టిందని కోర్టులపైన కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉందని మాజీ ఎంపి మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. ఒకే నేరంపై వివిధ రాష్ట్రాల్లో కేసులు వేయడం కోర్ట్ సమర్ధించడం బాధగా ఉందని, ఉపా కేసులు పెట్టి వరవరరావు లాంటి వారిని జైల్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10130 కోట్లు బీజేపికి ఎలక్ట్రోల్ బాండ్ల పేరు మీద నిధులు వచ్చాయని నిలదీశారు. ఇవన్నీ ప్రశ్నిస్తే కేసులు పెడతారా…?బీజేపీ, నియంత అవినీతి పాలనపై నిరంతర పోరాటం చేస్తామని మౌన దీక్ష రాహుల్ కోసమే కాదు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి స్వేచ్చా కోసం చేస్తున్నట్లు తెలిపారు.

రాహుల్ అసమర్థుడనే ముద్ర వేసేందుకు బిజెపి ప్రయత్నాలు: పొన్నం ప్రభాకర్
మోడీ వాట్సప్ యూనివర్శిటీ రాహుల్ పైన అసమర్థుడు అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అదానికి, మోడీకి సంబంధం ఏంటనే దానికి సమాధానం చెప్పడానికి మోడీ భయపడుతున్నాడని అందుకే రాహుల్ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందన్నారు. గుజరాత్ కోర్టులు బీజేపీ కార్యాలయాలుగా మారాయా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది న్యాయ స్థానాలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా సత్యాగ్రహ మౌనా దీక్ష దేశ వ్యాప్తంగా చేపడుతున్నామని తెలిపారు.

గాంధీ కుటుంబం దేశానికి సేవ చేసిన కుటుంబం: శ్రీధర్ బాబు
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సత్యాగ్రహ మౌన దీక్ష చేపట్టామని బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసి రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తుందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు. దేశ ప్రజలకు దైర్యం చెప్పడానికే రాహుల్ జోడో యాత్ర చేశారని రాహుల్‌కు నేడు దేశం మొత్తం సంఘీభావం తెలుపుతుందన్నారు .మతతత్వ పార్టీ విధానాలను ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులు అభివృద్ధి చెందారని పేర్కొన్నారు.

దేశానికి ప్రపంచస్థాయిలో పేరు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే ః మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీనేని మోడీ, షాల, పరిపాలనలో నియంత పాలన కొనసాగిస్తోందని ఇతర పార్టీలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు.
దేశ సంపదను కొంత మంది చేతిలో బందీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న మోడీ విధానాలను సాగేనంపేందుకు ప్రజల ఏకమైతున్నారని, గమనించి బిజెపి నాయకులు మరోసారి దొంగచాటుగా అధికారం చేపట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

దేశాన్ని రక్షించేందుకు రాహుల్ పోరాటం: మన్సూర్ అలీఖాన్
మత విద్వేషాన్ని అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ ఎంతో పోరాడుతున్నారని, దేశాన్ని ఒక్కటిగా ఉంచేందుకు కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే పోరాడుతున్నారని ఏఐసిసి ఇంచార్జీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు దేశ ప్రజలంతా కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీకి అండగా ఉంటారని నాకు ఆ నమ్మకం ఉందని మీరంతా రాహుల్ కి అండగా ఉండడం ఎంతో బలాన్ని ఇస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News