Monday, April 29, 2024

ధరల పెరుగుదలకు మోడీ ప్రభుత్వమే కారణం: ఎంపి సప్తగిరి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ధరల పెరుగుదలకు మోడీ ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలే కారణం కాంగ్రెస్ ఎంపి సప్తగిరి శంకర్ ఉలక మండిపడ్డారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ, ద్రవ్యోల్బణం. నిరుద్యోగం, రికార్డు ధరల పెరుగుదల, అత్యధిక నిరుద్యోగత అని పీడకలను అందించారని చురకలంటించారు.  గత ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వ రికార్డు స్థాయిలో పెంచిన ధరలు ఇలా ఉన్నాయన్నారు. దేశంలో అడ్డగోలుగా రికార్డు స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.  2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరల పెరుగుదలను నియంత్రించడంలో ప్రధాని మోదీ విఫలం కావడమే కాదని, ఆయన తప్పుడు విధానాలు, మోసపూరిత విధానాలు ప్రజల కష్టాలను మరింత పెంచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆహార ధాన్యాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి నిత్యావసర వస్తువులు జిఎస్ టి రహితంగా ఉన్నాయని, 2019లో ఓటర్లకు ప్రగల్భాలు పలికిన ప్రధాని 2022లో ఆ వస్తువులపైనే జిఎస్ టి విధించారని దుయ్యబట్టారు. మోడీ 2019 ఎన్నికలలో ఓట్లను గెలవడానికి ఉజ్వల యోజనను ఉపయోగించారని, కానీ వెంటనే, అతను వంట గ్యాస్ సబ్సిడీలను తొలగించారని గుర్తు చేశారు. తన ఖజానాను అన్ని విధాలా నింపుకోవాలనే ఆశతో మోడీ ప్రభుత్వం విపరీతమైన ఇంధన పన్నులను విధించిందని,  అది భారతీయ వినియోగదారుల కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసిందన్నారు.

పెట్రోల్, డీజిల్, ఎల్ పిజి అంతర్జాతీయ ధరలు 2021-22 కంటే 2013-14లో చాలా ఎక్కువగా ఉన్నాయని, అయితే వినియోగదారులు యుపిఎ ప్రభుత్వ హయాంలో కంటే ఈ రోజు ఒక లీటర్ ఇంధనం లేదా ఎల్ పిజి సిలిండర్ కోసం చాలా ఎక్కువ చెల్లిస్తున్నారన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, ఎల్‌పిజి ధరలు గత కొన్ని నెలలుగా తగ్గుతున్నాయని,  అయితే దాని ప్రయోజనం వినియోగదారులకు చేరలేదని సప్తగిరి వివరించారు. అయితే అంతర్జాతీయ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి ధరలను పెంచడం ఈ ప్రభుత్వం ఎప్పుడూ మర్చిపోలేదన్నారు. మోడీ ప్రభుత్వ విధాన ఎంపికల ఫలితంగా దేశంలో నిరుద్యోగ పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని,  నోట్ల రద్దు, హడావుడిగా అమలు చేసిన జిఎస్ టి ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, పైగా, మోడీ ప్రభుత్వం పిఎస్‌యులను మూసివేసి ప్రైవేటీకరించడంతోపాటు విలువైన జాతీయ ఆస్తులను తన కుబేరులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ యువజన వ్యతిరేక విధానాల వల్ల కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయని, ఇది మొత్తం మంజూరైన పోస్టులలో 24 శాతంగా ఉందన్నారు.  పేలవంగా రూపొందించబడిన అగ్నిపథ్ పథకం ఉద్యోగ అవకాశాలకు తాజా ముప్పుగా ఏర్పడిందని,  మన యువతతో పాటు దేశ భద్రతకు కూడా ముప్పువాటిల్లినుందన్నారు.  సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్నవారు నిరాశకు గురవుతున్నారని, పెన్షన్ లేదా భద్రతకు ఎలాంటి హామీ లేకుండా 4 సంవత్సరాల పాటు కాంట్రాక్టు ఉద్యోగాలు చేయడం దారుణమైన విషయమన్నారు.  పరిణామాలు వినాశకరమైనవిగా ఉన్నాయని, లక్షలాది మంది యువత నిరుత్సాహానికి గురికావడంతో పాటు ఉద్యోగాలకు దూరమవుతున్నారని సప్తగిరి విరుచుకపడ్డారు.

ఈ వలసలు ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఉద్యోగాల కోసం వెతుకుతున్న 20 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువతలో 42% మంది నిరుద్యోగులు, పిహెచ్ డి హోల్డర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు కూడా ప్యూన్, ఇతరులు వంటి చాలా చిన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేయవలసి వస్తుందని,  జూన్ 2021 నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్త నిరసనలు, సామూహిక ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఆగస్టు 5న ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రదర్శన తర్వాత, వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్ 4న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ‘మెహంగై పర్ హల్లా బోల్ ర్యాలీని నిర్వహించబోతున్నామన్నారు.  ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజా వ్యతిరేక, యువకుల వ్యతిరేక నిర్ణయాలకు తీసుకుంటే మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News