Saturday, April 27, 2024

సిఎం కెసిఆర్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Corona positive for CM KCR

 

స్వల్ప లక్షణాలు, యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్
ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : వ్యక్తిగత వైద్యుడు
సిఎం సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా : గవర్నర్
పోరాటయోధుడు కోలుకుంటారు : కెటిఆర్
అందరి ప్రార్థనలతో మహమ్మారిని జయిస్తారు : ఎంపి సంతోష్
ప్రజల ఆశీర్వాదంతో కెసిఆర్ త్వరగా కోలుకుంటారని పలువురు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, పార్టీల అధ్యక్షుల ఆకాంక్ష

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కరోనా సోకింది. సిఎం కెసిఆర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సిఎస్ సోమేష్‌కుమార్ వెల్లడించారు. సిఎంకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని సిఎంకు వైద్యులు సూచించారని తెలిపారు. ప్రస్తుతం సిఎం కెసిఆర్ తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక వైద్యుల బృందం సిఎం కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సిఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం సిఎం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ము ఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు తెలిపారు. నిరంతరం వైద్యుల బృ ందం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్‌కు విశ్రాంతి సూచించామ ని వివరించారు. యాంటిజెన్ పరీక్షల్లో సిఎం కెసిఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆర్‌టిపిసిఆర్ ఫలితాల కోసం వైద్య బృందం ఎదురుచూస్తున్నారు. స్వల్ప జలుబు లక్షణాలతో సి ఎంకు కొవిడ్ బయటపడింది. నాగార్జు న సాగర్ ఎన్నికల ప్రచారంలో భాగం గా ఈ నెల 14న హాలియాలో జరిగిన సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. సాగర్ టిఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ సహా పలువురుకి కరోనా సోకింది. సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా

ప్రముఖల సందేశాలు
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కరోనా అని తెలిసి ఆందోళనకు గురయ్యానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. సిఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్ సంపూ ర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నానని పే ర్కొన్నారు. సిఎం ఐసోలేషన్‌లో ఉన్నారని, వైద్యుల బృందం నిరంతరం కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని సామాన్యుల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి, కెసిఆర్ గొప్ప ధైర్యవంతుడు, పోరాటయోధుడు అని, అందరి ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటారని కెటిఆర్ ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు.ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. కరోనాతో పోరాడే శక్తిని కెసిఆర్‌కు ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అందరి ప్రార్థనలతో ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరగా కోలుకుంటారని ఎంపి సంతోష్ కుమార్ ఆకాంక్షించారు. వైద్యుల బృందం సిఎం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఎంపి సంతోష్‌కుమార్ సోమవారం ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరగా కోలుకోవాలని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవ రావు ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలంగాణ ప్రజల దీవెనలే కాపాడుతాయని, అన్నింటికి మించి ఆయన మనోస్థైర్యం కరోనా మహమ్మారిని జయిస్తుందని మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మంత్రి హరీష్‌రావు, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, విప్ బాల్క సుమన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాత ముఖ్యమంత్రి కెసిఆర్‌రే కరోనా పాజిటివ్ అని తెలియడంతో రాష్ట్ర ప్రజలు, తాను ఆందోళన చెందానని రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రార్థనలు ఫలించి అతి త్వరలోనే ముఖ్యమంత్రి కరోనాను జయించి బయటకు వస్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.ముఖ్యమత్రి కెసిఆర్‌కు కరోనా పాజిటివ్ రావడం బాధాకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు.

దేవుడి దీవెనలతో త్వరగా కోలుకోవాలి : ఎంఎల్‌సి కవిత
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు సిఎం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎంఎల్‌సి కవిత ట్వీట్ చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కెసిఆర్ త్వరగా కోలుకోవాల ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ ఆకాంక్షించారు. కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరగా కోలుకోవాలని పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ఆకాంక్షించారు. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీర్వాదాలతో సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Corona positive for CM KCR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News