Monday, April 29, 2024

కరోనా పాజిటివ్ గర్భిణి ప్రసవం..

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌పై గాంధీ వైద్యులు పోరాటం చేస్తూ మరోపక్క అత్యవసర సేవలో పాలు పంచుకుంటున్నారు. తాజాగా పాజిటివ్ వచ్చిన గర్భిణికి శస్త్ర చికిత్సలు చేసి సుఖంగా ప్రసవం చేశారు. నగరంలో కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో అందరికి పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రికి చేర్చారు. అందులో నవమాసాలు నిండిన గర్భిణి(22) కూడా ఉంది. ఆమె గత వారం రోజుల నుంచి ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతుంది. శుక్రవారం మహిళకు పురిటినొప్పులు రావడంతో వైద్యులు ప్రత్యేక వార్డుకు తరలించి ప్రసవం చేశారు.

పాజిటివ్ ఉన్న గర్భిణిని ప్రసవం చేయాలంటే ఎంతో జాగ్రత్తలు తీసుకోని గాంధీ వైద్యులు వైద్యసేవలందించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రత్యేక జాగ్రత్తల మధ్య ప్రసవం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తల్లి, బిడ్డల ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు కరోనాతో ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. డా. అనిత వైద్య బృందం చేసిన సేవలపై బాలింత కుటుంబసభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్న తరువాత ఆమె స్వస్థలానికి పంపుతామని వైద్యులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News