Wednesday, May 1, 2024

గాంధీలో అతిథ్యమిచ్చారు

- Advertisement -
- Advertisement -

corona victims

 

పేషంట్లుగా కాకుండా సొంత వ్యక్తుల్లా చూసుకున్నారు
ఇంట్లో ఉన్నట్లే అనిపించింది, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదు
డిశ్చార్జ్ అయిన కొవిడ్ బాధితుల వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీలోని వైద్యులు తమకు అతిధ్యమిచ్చారని, పేషెంట్లుగా కాకుండా సొంత వ్యక్తుల్లా చూసుకున్నారని వారు కొనియాడరు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే క్రమంలో వాళ్లు మీడియాతో మాట్లాడుతూ… కరోనా పాజిటివ్ వ్యక్తులను డాక్టర్లు ఎంతో బాగా చూసుకున్నారని, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తమకు కుంటుంబ సభ్యులకన్న ఎక్కువగా సేవలందించారని కొనియాడారు. మూడు పూటలా నాణ్యమైన, బలవర్థకరమైన ఆహారం పెట్టారని తెలిపారు. అంతకు ముందు తమకు వైరస్ సోకిందనగానే ఎంతో భయపడ్డామని, కానీ డాక్టర్లు, సిబ్బంది ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా తాము మూములుగా వైరస్ నెగటివ్‌తో ఇంటికి వెళుతున్నట్లు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వానికి తాము ఎప్పటికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. వైరస్ సొకిందన్న విషయం తెలియగానే తాము ఎంతగానో భయాందోళనకు గురయ్యామని, కానీ గాంధీలో అడ్మిట్ అయిన మరోసటి రోజు నుంచి ఈ టెన్షన్ మొత్తం పోయిందని తెలిపారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు తమకు ఇంట్లో ఉన్న వాతావరణాన్ని కల్పించారన్నారు.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం: రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, గాంధీ ఆసుపత్రిలో తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా రాజారావు సార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని డిశ్చార్జ్ అయిన బాధితులు తెలిపారు. ప్రతి రోజూ మూడు సార్లు వచ్చి తమ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, అన్ని సౌకర్యాలు కల్పించారని వికారాబాద్‌కి చెందిన ఓ బాధితుడు చెప్పాడు. ముఖ్యంగా కొవిడ్ పేషెంట్లకు అద్బుతమైన ఆహారాన్ని అందించారని, రోగ నిరోదక శక్తిని పెంచేందుకు ప్రతి రోజూ ఎగ్‌తో పాటు డ్రైప్రూట్స్‌ని కూడా అందించారని వరంగల్‌కి చెందిన మరో బాధితుడు పేర్కొన్నారు. వాస్తవంగా ప్రభుత్వాసుపత్రులు అనగానే చాలా మందికి వైద్యం సరిగ్గా చేయరు అనే అనుమానాలు ఎక్కువగా ఉంటాయని, కానీ గాంధీలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నారని వికారాబాద్ మర్పల్లికి చెందిన మరో కొవిడ్ బాధితుడు పేర్కొన్నారు. ఇక్కడి వైద్యులకు, నర్సులు, శానిటేషన్ సిబ్బందికి చేతులు జోడించి మొక్కుతున్నామని బాధితులు తెలిపారు. కొవిడ్ వైరస్ బారిన పడ్డా, భయాందోళన చెందకుండా వైద్యులు చెప్పిన నిబంధనలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.

 

Corona Treatment Was Good In Gandhi Hospital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News