Tuesday, November 12, 2024

భారత్ లో కొత్తగా 20,036 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona Virus Cases Rise In India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖంపడుతున్నాయి. గత 24 గంటల్లో 20,036 మందికి కరోనా వైరస్ సోకగా 256 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు సంఖ్య 1.02 కోట్లకు చేరుకోగా 1.48 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 98.83 లక్షల మంది కోలుకోగా 2.54 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా కేసుల సంఖ్యలో ఇండియా రెండో స్థానంలో ఉండగా అమెరికా (2.04 కోట్లు) తొలి స్థానంలో ఉంది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్యలో ఇండియాలో మూడో స్థానంలో ఉండగా అమెరికా(3.54 లక్షలు) తొలి స్థానం, బ్రెజిల్ (1.94 లక్షలు) రెండో స్థానంలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News