Wednesday, May 1, 2024

వరి వద్దు… పత్తి, కంది పంటలే సాగు చేయాలి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Cotton and sorghum should be cultivated: Niranjan Reddy

హైదరాబాద్: వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలు భూమి సాగు అవుతోందని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకలం సాగు-విత్తన లభ్యతపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. 13.06 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు అవసరం కాగా ప్రస్తుతం 18.287 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 70.05 లక్షల ఎకరాల్లో పత్తి, 20 లక్షల ఎకరాల్లో కంది పంట, 41 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోందని అంచనా వేశామన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా డిమాండ్ ఉన్న కంది, పత్తి పంటలనే సాగు చేయాలని నిరంజన్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పండే పత్తికి అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 1.4 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా జిల్లాలో ఇప్పటికే 59.32 లక్షల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలియజేశారు. మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అకాల వర్షాల కారణంగా నాణ్యమైన సోయాబీన్ విత్తనం అందుబాటులో లేదని, రైతులు సోయాబీన్ సాగుకు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, సోయా విత్తనాలు కొనే రైతులు జాగ్రత్తగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవాలని, వచ్చే యాసంగిలో విచ్చలవిడిగా వరి సాగు చేయొద్దని రైతులకు నిరంజన్ రెడ్డి సూచించారు.

తక్కువ పెట్టుబడితో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వేరుశనగ, నువ్వులు, ఆవాలు లాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. పప్పు దినుసుల పంటల సాగు ప్రోత్సహించేందుకు అంతర పంటగా వేసేందుకు ఉచితంగా ఎకరాకు రెండు కిలోల కంది విత్తనాలు, లైసెన్స్ లేని వారి వద్ద విత్తనాలు, ఎరువులు, పరుగుల మందులు కొనకూడదని రైతులకు నిరంజన్ రెడ్డి తెలియజేశారు. పత్తిలో నకిలీ విత్తనాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందర్ రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండి కేశవులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News