Monday, April 29, 2024

అరకోటికి చేరిన కరోనా రోగులు

- Advertisement -
- Advertisement -

Covid-19

 

వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 50 లక్షలకు చేరుకుంది. వైరస్ తొలుత తలెత్తిన నాటి నుంచి ఇప్పటివరకూ ఐదు నెలలు గడిచాయి. చైనా వైరస్ ప్రభావంతో పలు దేశాలలో నెలల తరబడి లాక్‌డౌన్ విధించారు. ఆర్థిక చక్రబంధంలో పడ్డ దేశాలు ఇప్పుడిప్పుడే ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. లాక్‌డౌన్, షట్‌డౌన్‌లను తొలిగిస్తున్నారు. ఈ దశలో దాదాపు ఐదు నెలల వైరస్ కారణంగా రోగుల సంఖ్య అరకోటి మైలురాయికి చేరింది. మందు, సరైన చికిత్సా విధానం లేదని చెపుతోన్న ఈ వైరస్‌తో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3,25000మంది మృతి చెందారు.

వైరస్ పుట్టిల్లు అయిన చైనా ఇప్పుడు మొత్తం నమోదిత కేసులతో పోలిస్తే ఎక్కువ కేసుల దేశాలలో 13వ స్థానంలో నిలిచింది. అక్కడ మొత్తం నమోదు అయిన కేసులు 83000. మృతుల సంఖ్య 4634. అత్యధిక జనాభా గల ఈ దేశంలో ప్రభుత్వం విస్తృత నియంత్రణలకు దిగడంతో వైరస్ త్వరిగతిన అదుపులోకి వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాలో అత్యధికంగా 15 లక్షల మందికి వైరస్ సోకింది. మృతుల సంఖ్య కూడా అధికంగానే నమోదు అయింది. రష్యాలో3లక్షల కరోనా కేసులు రికార్డు అయ్యాయి. అత్యధిక ప్రభావం పడ్డ ఐదు దేశాలలో తరువాతి క్రమంలో స్పెయిన్‌లో 2,78000 కేసులు, బ్రెజిల్‌లో 2,71,800 కేసులు , బ్రిటన్‌లో 2,48,000 కేసులు చోటుచేసుకున్నాయి.

తొలుత రష్యాలో వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ తరువాత విస్తరించింది. కొత్తగా దాదాపు 9 వేల కేసులు నమోదు కావడంతో అక్కడ కోవిడ్ రోగగ్రస్తుల సంఖ్య బుధవారానికి మూడు లక్షల మార్క్‌కు చేరింది.రష్యాలో వైరస్‌తో మృతుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే మృతుల సంఖ్యను రష్యా దాచిపెడుతోందని విమర్శలు వెలువడ్డాయి. అయితే తాము మృతుల సంఖ్యను దాచిపెట్టకుండా ఖచ్చిమైన గణాంకాలను వెలువరిస్తున్నట్లు రష్యా అధికారిక వర్గాలు తెలిపాయి. రష్యాలో కరోనాతో మొత్తం మృతుల సంఖ్య ఇప్పటికి 2972కు చేరింది. గడిచిన 24 గంటలలో 135 మంది చనిపోయినట్లు దేశ కరోనా విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటనలో తెలిపారు.

దేశంలో వైరస్ ఇప్పుడు తటస్థీకరణ దశకు చేరిందని భావిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థలో రష్యా ప్రతినిధి డాక్టర్ మెలిటా వుజ్నోవిచ్ ప్రకటించినట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. రష్యాలో అతధిక స్థాయిలో మాస్కోనే ప్రభావితం అయింది. అక్కడ ఎనిమిది వారాలుగా లాక్‌డౌన్ సాగుతోంది. పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉన్నట్లు రష్యా మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. ఇప్పటికిప్పుడు ప్రజలను వాకింగ్‌లు, వ్యాయామాలకు అనుమతించలేమని వివరించారు. స్పెయిన్‌లో లాక్‌డౌన్‌ను సడలించారు. పర్యాటకులకు త్వరలోనే అన్ని విధాలుగా అనుమతులు ఇస్తారని విదేశాంగ మంత్రి తెలిపారు. అయితే అంతా అదుపులో ఉందని నిర్థారణ అయిన తరువాతనే ఏదైనా చేయవచ్చునని వివరించారు.

స్పెయిన్‌కు సమ్మర్‌లో బ్రిటన్ నుంచి పర్యాటకులు వస్తుంటారు. వెనువెంటనే బ్రిటిష్ పర్యాటకులకు అనుమతి కల్పించేది లేనిది ఇప్పుడు చెప్పలేమని స్పెయిన్ విదేశాంగ మంత్రిణి అయిన అరంచ గొన్‌సాల్వేజ్ లయ తెలిపారు. స్పెయిన్‌లో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మాడ్రిడ్, బర్సిలోనా వంటి నగరాల్లో వైరస్ ఎక్కువగా విలయతాండవం చేసింది. దీనితో అక్కడ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. బ్రిటన్ నుంచి స్పెయిన్‌కు విమాన రాకపోకలను నిర్వహించే ప్రధాన సంస్థ ర్యానయర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకొంటోంది.

జులై నాటికి 40 శాతం విమానాలను నిర్వహించగలమని అధికారులు తెలిపారు. అయితే బ్రిటన్ నివాసితులు స్పెయిన్‌ను ఈసారి సమ్మర్ హాలీడే కోసం ఎంచుకోరాదని అధికారికంగా సూచనలు వెలువడ్డాయి. బ్రిటన్‌లో క్వారంటైన్ నిబంధనలను ఖచ్చితమైన రీతిలో పాటిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం సరికొత్త క్వారంటైన్ చర్యలు అమలు చేస్తారని బ్రిటన్ విదేశాంగ మంత్రి ప్రీతీ పటేల్ తెలిపారు. 14 రోజుల పాటు క్వారంటైన్ ఉంటుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News