Monday, April 29, 2024

ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

CP Anjani Kumar to suspended 3 Constables

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలతో దురుసుగా ప్రవర్తించిన ముగ్గురు కానిస్టేబుళ్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వులో పనిచేస్తున్న మందుల శరత్ కుమార్, చిలకలగూడ పిఎస్‌లో పనిచేస్తున్న గంటెపాక సుధాకర్, బహదూర్‌పురా పిఎస్‌లో పపనిచేస్తున్న బాబురావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీ కామాటిపుర, దేవిబాగ్ హరిజన్ బస్తీకి చెందిన బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న బాబురావు అతడి కుమారులు తమకు వరదసాయం రాలేదని స్థానికులతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. బాబురావు భార్య ముందుగానే రూ.10,000 తీసుకున్నదని స్థానికులు తెలిపారు. ఈ విషయం చెప్పినా వారు వినలేదని స్థానికులు తెలిపారు. వారిదాడిలో పలువురికి తీవ్రగాయాలు కావడంతో కామాటిపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

CP Anjani Kumar to suspended 3 Constables

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News