Saturday, April 27, 2024

హెల్మెట్‌ను.. పట్టించుకోవడం లేదు

- Advertisement -
- Advertisement -

Cyberabad traffic police enforcing helmet rule

హైదరాబాద్: మోటార్ సైకిల్ నడుపుతున్న వారు పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు ఎంత చెప్పినా పట్టించుకోవడంలేదు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులపై జరిమానాలు విధిస్తున్నారు. మూడు కమిషనర్లకంటే ముందుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బైక్ వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధనను మొదట అమలులోకి తీసుకువచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా వెనుక కూర్చున్న వారు మృతిచెందారు. బైక్‌లను నడుపుతున్న వారు హెల్మెట్‌పెట్టుకోవడంతో రోడ్డు ప్రమాదాల్లో గాయాలతో బయటపడుతున్నారు. కానీ వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో మృతిచెందుతున్నారు. ఇలా చాలామంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మృతిచెందారు.

దీంతో ట్రాఫిక్ పోలీసులు బైక్‌పై ఇద్దరు వెళ్తే తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. పెట్టుకోనివారికి జరిమానా విధిస్తున్నారు. ఆరు నెలల్లో 8,63,341మందికి జరిమానా విధించారు. అయినా కూడా మోటార్ సైకిల్ నడుపుతున్నవారిలో మార్పు రావడంలేదు. మేలో 2,83,377, జూన్ 2,47,497, జులై 1,77,058, ఆగస్టు 67,863, సెప్టెంబర్ 40,209, అక్టోబర్ 47,337మందికి జరిమానా విధిస్తున్నారు. చేవెళ్ల వద్ద జరిగినా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు హెల్మెట్ ధరించకపోవడంతో మార్చి నుంచి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు జరిమానాలు విధిస్తూనే ఉంటున్నారు. ఆరు చాలన్లు పెండింగ్‌లో ఉన్నాయి, అయినా కూడా యువకుడు హెల్మెట్ పెట్టుకోలేదు. డిసెంబర్ 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతిచెందాడు.

నిర్లక్ష్యం వీడడంలేదు…

హెల్మెట్ ధరించాలని, ప్రాణాలు నిలుపుకోవాలని పోలీసులు కోరుతున్న మోటార్ సైకిళిస్టులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే చాలామంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్నారని చెబుతున్నా వినడంలేదు. హెల్మెట్‌ను కూడా ఐఎస్‌ఐ మార్కు ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. సగం హెల్మెట్లు, కన్‌స్ట్రక్చన్ సైట్లలో వాడే వాటిని ఉపయోగించవద్దని, వాటిని హెల్మెట్లుగా పరిగణించమని పోలీసులు చెబుతున్నారు. హెల్మెట్లు పెట్టుకోకుండా వాహనాలను నడుపుతున్న వారి కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వారిపై జరిమానాలు విధిస్తున్నారు. ప్రతి ఒక్కరు బైక్‌కు సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News