Sunday, April 28, 2024

శవాల మధ్య కరోనా పేషెంట్స్‌కు చికిత్స.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

 

ముంబయిః నగరంలోని ఓ ఆస్పత్రిలో శవాల మద్య కరోనా పేషెంట్స్‌కు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. వివరాల్లోకి వెళితే..ముంబయిలోని సియాన్ ఆస్పత్రిలో కొన్ని మృత‌దేహాలను న‌ల్ల‌టి ప్లాస్టిక్ క‌వ‌ర్ తో చుట్టి బెడ్‌ల‌పై ఉంచిన ఓ వార్డులోనే కరోనా పేషెంట్స్‌కు చికిత్స అందిస్తున్నారు. దీన్ని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషమని, మృత‌దేహాల పక్కన కరోనా బాధితులకు చికిత్స చేయడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని,  మ‌హార‌ష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితేష్ ఎన్ రాణే ప్ర‌శ్నించారు. దీనిపై స్పందించిన హాస్పిటల్ డీన్ ప్రమోద్ ఇంగాలే మాట్లాడుతూ.. కోవిడ్-19తో చ‌నిపోయిన వారి డెడ్ బాడీలను ఉంచ‌డానికి శ‌వాల గ‌దులు స‌రిపోవ‌డం లేదని, అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి కూడా కొంత స‌మ‌యం ప‌డుతున్నందున శ‌వాల‌ను వార్డులోనే ఉంచామని, ఇప్పుడు ఆ మృతదేహాలను అక్కడ నుంచి తొలగించామని తెలిపారు.

Dead Bodies Next to Corona Patients in Mumbai Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News