Monday, April 29, 2024

అభివృద్ధిని సగర్వంగా చాటి చెప్పడానికే దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంత్సరాలు పూర్తి చేసుకొ ని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సం దర్భంగా ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్ర భుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన అనేక పథకాలలో సాధించిన విజయాలను, రాష్ట్ర అభివృద్దిని సగర్వంగా చాటి చెప్పడానికే ఈ ఉత్సవాలను జ రుపుకుంటున్నామని ప్రభుత్వ విప్,చెన్నూరు ఎ మ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంగళవారం విద్యా దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అధనపు కలెక్టర్ రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌ తమి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రతి తెల ంగాణ బిడ్డ తన వంతు పాత్ర పోషించారని, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 9 సంతవ్సరాల పాలనలో మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి తాగు నీరు, రై తుబంధు, రైతుభీమా, చెరువుల పునరుద్దరణ కొ రకు మిషన్ కాకతీయ, వృద్దులు, దివ్యాంగులు, మహిళా సంక్షేమం కోసం ఆసరా పించన్‌లతో పాటు అనేక సంక్షేమాభివృద్ది పథకాలతో తెలంగాణ రాష్ట్రం కృషి చేస్తుందన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. రెప్ప పాటు సమయం కూడా కోత లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తూ రైతులకు వ్యవసాయ సాగు కొరకు అందించడం జరుగుతుందన్నారు.జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీ అ వార్డులలో టాప్ 20లో 19 అవార్డులు రాష్ట్రానికే వచ్చాయని, ప్రతి రంగంపై ప్రత్యేక శ్రద్దతో అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు. పోరాడి తె చ్చుకున్న తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం లో, విద్యుత్ వినియోగంలో ప్రథమ స్థానంలో ఉందని, చెరువులకు పూర్వ వైభవం తెచ్చుకున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం చెన్నూరు ని యోజకవర్గంలో గత రబీ సీజన్‌లో 31 వేల మె ట్రిక టన్నుల వరి దాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఈసారి 107 వరి దాన్యం కొనుగో లు కేంద్రాల ద్వారా 31 వేల మెట్రిక్ టన్నుల వ రి దాన్యంను కొనుగోలు చేయడం జరిగిందన్నా రు. అన్ని రంగాల అభివృద్ది దిశగా ప్రభుత్వం అ హర్నిషలు పాటు పడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కా ర్పొరేట్ స్థాయి మౌళిక సదుపాయాల నడుమ నా ణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో 248 పాఠశాలలను ఎంపిక చేసి 12 విభాగాల్లో 90 కోట్ల రూ పాయల అంచనా వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందన్నారు.
మిగిలిన 748 పాఠశాలలను దాదాపు 245 కో ట్లతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదా పు 50 వేల 38 మంది విద్యార్ధిని విద్యార్థులు చ దువుకుంటున్నారని, ఒకొక్కరికి ఏకరూప దుస్తుల జత చొప్పున వీరందరికి లక్షా 64 వేల ఏకరూప దుస్తులు, 3 లక్షల 34 ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణి చేయడం జరిగిందన్నారు. పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభిచండం జరిగిందని, పిల్లలకు పోషక విలువలు గల ఆహారాన్ని అందించేందుకు రాగి జావ అందించడం జరుగుతుందన్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా 74 వే 171 మందికి అందించడం జరుగుతుందని, వ ంట చేసే వారికి వేతనాన్ని రూ. 1 నుండి రూ. 3 వేల వరకు పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశాభివృద్దికి బాలికా విద్య అవసరమని, ఈ క్ర మంలో 18 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయా ల ద్వారా 3 వేల 500 మందికి నాణ్‌యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యాభివృద్దికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను సన్మానించడంతో పాటు ట్యాబ్‌లను పం పిణీ చేశారు. తొలిమెట్టు ఎగ్జిబిషన్ అందరిని అలరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అ ధికారి ఎస్ యాదయ్య, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News