Wednesday, May 1, 2024

18వ రోజుకు చేరిన రైతుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

Delhi Farmers Protest Live Updates

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు ఉధృతం అయ్యాయి. రైతుల ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ రహదారులపైనే రైతులు నిరసన చేపడుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజిపూర్ సహా పలు రోడ్ల మూసివేశారు. నిరసనలో పాల్గొనేందుకు వేలాదిమంది రైతులు రాజస్థాన్ నుంచి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ట్రాక్టర్ల ర్యాలీతో ఢిల్లీ-జయపుర రహదారిని రైతులు దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సోమవారం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు నిరాహార దీక్షకు దిగనున్నారు. రైతు సంఘాలు రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.

Delhi Farmers Protest Live Updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News