Sunday, April 28, 2024

దేశ సమగ్రతకు భంగకరంగా చైనా నిధులు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌క్లిక్‌పై ఢిల్లీ పోలీసు ఎఫ్‌ఐఆర్ దాఖలు
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ న్యూస్‌పోర్టల్ న్యూస్‌క్లిక్‌పై ఢిల్లీ పోలీసు విభాగం శుక్రవారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని , సర్వసత్తాకతను విచ్ఛిన్నం చేసేందుకు ఈ సంస్థ చైనా నిధులు పొందుతోందని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ఉగ్రవాద చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం పరిధిలో కేసు దాఖలు అయింది. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ప్రబీర్ ప్రజాస్వామ్య లౌకిక ప్రజా కూటమి వేదిక ( ప్యాడ్స్) పేరిట ఓ ఏర్పాటు అయిన ఓ సంస్థతో కలిసి దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రచార విభాగానికి చెందిన యాక్టివ్ మెంబర్ నెవెలి రాయ్ ద్వారా ఈ విదేశీ అక్రమ నిధులు అందుతున్నాయని తెలిపారు. చైనాకు చెందిన టెలికం దిగ్గజ సంస్థలు క్సియోమి, వివో వంటివి పలు షెల్ కంపెనీలను పిఎంఎల్‌ఎ , ఫెమాల ఉల్లంఘిస్తూ తీసుకువచ్చాయని , కుట్రలో భాగంగానే భారతదేశంలోకి ఈ నిధులను చేరవేస్తున్నాయని వివరించారు. ఇందుకు న్యూస్‌క్లిక్‌ను వాడుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News