Friday, May 3, 2024

మహిళల రక్షణకు పెద్దపీట

- Advertisement -
- Advertisement -

DGP mahender reddy

 

మహిళా భద్రత సంవత్సరంగా 2020
డిజిపి మహేందర్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోందని, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పోలీసు విభాగంలో మహిళా భద్రతా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డిజిపి మహేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా దేశంలోనే తొలిసారిగా, మరో రాష్ట్రంలో లేని విధంగా ఈ సంవత్సరాన్ని మహిళా భద్రతా సంవత్సరంగా పోలీస్ శాఖ ప్రకటించింది డిజిపి వివరించారు. గతంలో రాష్ట్రంలో మహిళా భద్రత సిఐడి విభాగంలోనే ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మహిళలపై జరిగే నేరాలను ఏ విధంగా అరికట్టాలనే అంశంపై సీనియర్ ఐపిఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ పలు చట్టాలు, ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ మార్గాలను పరిశీలించి పలు ప్రతిపాదనలు చేసిందని డిజిపి వివరించారు.

మహిళలపై జరిగే నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టేందుకు గాను మహిళల పై జరిగిన నేరాలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేయడం, సత్వర న్యాయాన్ని సాధించేందుకు ఈ నూతన దశాబ్దంలో మొదటి సంవత్సరాన్ని మహిళా భద్రతా సంవత్సరంగా పోలీస్ శాఖ ప్రకటించడం జరిగిందన్నారు. స్రీలు సాధారణంగా నేరాలకు గురయ్యే ఐదు రంగాలను గుర్తించి వాటికు పరిష్కార మార్గాలకు ప్రత్యేక మాడ్యూల్ రూపొందించామన్నారు. ఈ రంగాలకు సంబంధించి ప్రత్యేక సిబ్బందిని కేటాయించి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించామని తెలిపారు.

మహిళా భద్రత విభాగం…విజయాలు
వేధింపులు, నేరాలు, దాడులు, అత్యాచారాలపై నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించే వాతావరణాన్ని మహిళా భద్రతా విభాగం తెలంగాణ వ్యాప్తంగా సృష్టించిందని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక మహిళా కానిస్టేబుల్, ఇద్దరు పురుష కానిస్టేబుల్ లతో కూడిన ప్రత్యేక షీ టీమ్ బృందం కెమెరా తో సహా ప్రజల మధ్య తిరుగుతూ నేరస్తుడిని గుర్తించి అదుపులోకి తీసుకునే విధంగా ఒక్క హైదరాబాద్ లోనే 100 షీ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని డిజిపి తెలిపారు.

అక్టోబర్ నుండి 2020 జనవరి ఒకటో తేదీ వరకు మహిళా భద్రత 24 వేల ఆరు వందల తొంబై ఫిర్యాదు లను స్వీకరించి వీటిలో అధిక శాతాన్ని పరిష్కరించారన్నారు. ఈ గణాంకాలను విశ్లేషిస్తే తమపై జరిగే నేరాల పై ఫిర్యాదు చేసే ధైర్యం, పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం, తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం మహిళల్లో పెరిగిందని విశ్లేషించవచ్చని, దీంతో పాటు పిల్లలు మహిళలు పెరిగిన సైబర్ నేరాలు కూడా పరిష్కరించేందుకు మహిళా భద్రత విభాగంలో ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. మహిళల అక్రమ రవాణా, వ్యభిచార వృత్తిలోకి దింపడం, అవయవాల వ్యాపారం తదితర నేరాల అదుపు గూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు.

DGP said 2020 as Women’s Safety Year
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News