Saturday, April 27, 2024

విదేశాలనుంచి వచ్చే అందరి వివరాలు సేకరించాలి

- Advertisement -
- Advertisement -

Etela rajender

 

జిల్లా వైద్య అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటెల

మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం సచివాలయంలో అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ… కరోనాపై అన్ని జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అదే విధంగా అన్ని జిల్లాల్లో అనుమానిత లక్షణాల వారి వివరాలు సేకరించి ఐసొలేషన్‌లో ఉంచాలని మంత్రి సూచించారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు కార్యదర్శి స్థాయి నుంచి ఆశ వర్కర్ వరకు అందరూ పనిచేయాలని తెలియజేశారు.

దీనికి జిల్లాల్లో వైద్యాధికారులు భాద్యత వహించాలని మంత్రి తెలిపారు. సిబ్బంది, డాక్టర్స్ సమయపాలన చేయకపోయినా, విధులు సరిగ్గా నిర్వహించ క పోయినా ఉపేక్షించేది లేదని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పని చేయని వారిని తొలగించాలని చెప్పారు. బాగా పనిచేసి, గౌరవం పెంచుకోవాలని మంత్రి సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామని, రోగుల రద్దీకి అనుగుణంగా డాక్టర్స్, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలలో ఆశ వర్కర్స్, వైద్య సిబ్బందికి కోవిడ్-19పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను మంత్రి కోరారు. అయితే కరీంనగర్‌కి గ్రానైట్ వ్యాపారం కోసం వచ్చిన చైనా , ఉజ్బెకిస్తాన్ వారిని గుర్తించి క్వారంటైన్ లో ఉంచినట్లు కరీంనగర్ జిల్లా వైద్య అధికారి ఈ కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, కమిషనర్ యోగితారానా, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, డిఎమ్‌ఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్ తదితర వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఆస్పత్రులకు చేర్చేందుకు అంబులెన్స్‌లు
కరోనా అనుమానితులను ఆస్పత్రులకు చేర్చేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆస్పత్రులకు చేర్చే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలతో 108 వాహనాలను ఏర్పాటు చేసినట్లు 108ఆపరేషన్స్ ఇంచార్జి బ్రహ్మానంద రావు తెలిపారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారితో పాటు, 108 సిబ్బంది కచ్చితంగా ప్రోటెక్షన్ కిట్స్ ధరించేలా చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల వద్ద 108 వాహనాలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

కరోనా కేసులు లేవని రిలాక్స్ అవ్వొద్దు
కొవిడ్ 19 కేసులు లేవని రిలాక్స్ అవ్వొద్దని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం కరోనాపై కోఠి డిఎంఇ కార్యాలయంలో వైద్యఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కొవిడ్ -19 వ్యాప్తిని సమర్ధవంతంగా నియంత్రించగలిగినందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్, సిఎం కెసిఆర్ వైద్యారోగ్యశాఖను అభినందించారని, దానికోసం కష్టపడుతున్న అధికారులు, సిబ్బందికి మంత్రి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి లేదని నిర్లక్షం చేయవద్దని, దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అప్రమత్తత కొనసాగించాలని ఆదేశించారు. విదేశాల నుండి రాష్ట్రం కి వచ్చిన ప్రతి వ్యక్తి హాస్పిటల్ కి రాకపోయినా, లక్షణాలు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటివద్దే ఐసొలేషన్‌లో ఉంచి ప్రతి రోజూ ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని మంత్రి కోరారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రణయ్‌లతో పలు అంశాలపై మంత్రి చర్చించారు.

Etela in Video Conference of District Medical Officers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News