Monday, April 29, 2024

ఎర్రబెల్లి x రాజగోపాల్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

Controversy

 

కోమటి రెడ్డిని ప్రజలే తరిమి కొడతారు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్

మనతెలంగాణ/హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్యవాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రూ. 50 వేల కోట్లతో చేపట్టిన మి షన్‌భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు రావడంలేదని తీవ్రంగా ఆరోపించారు. మిషన్‌భగీరథ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్న టిఆర్‌ఎస్ మాట నిలుపుకోలేదని కోమటిరెడ్డి అన్నారు. అలాగే రైతులకు ఎందుకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు పగలు 6గంటలు, రాత్రి 6గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతుందని కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యానాలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి జనంలో తిరుగుతున్నారా? రోడ్లపై తరుగుతున్నారని ప్రశ్నించారు.

నల్గొండ జిల్లాలో కోదాడ,సూర్యాపేటతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాలకు మిషన్ భగీరథ నీళ్లు వస్తుంటే కోమటి రెడ్డికి కనిపించడంలేదాని దుయ్యబట్టారు. ప్రజావ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోమ టి రెడ్డి వెంకటరెడ్డి ప్రజల్లోకి వెళ్లితే ఉరికించి, ఉరికించి కొడతారని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కోమటిరెడ్డి నువ్వు ఏమిమాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందాని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి జరుగుతుంటే కోమటిరెడ్డి పచ్చిఅబద్దాలు ఆడుతున్నారని నిందించారు. రైతుల సం క్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిం చి, సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి 24 గంటల విద్యుత్ సరఫరాచేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని ఆయన నిలదీశారు. రాష్ట్రా న్ని అనేక సంవత్సరాలు పాలించి భివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పై మాట్లాడే నైతిక హక్కు ఉందాని ప్రశ్నించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ గురించి రాజగోపాల్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆన్నారు.

కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మించకపోతే వరంగల్ ఎడారిగా మారిపోయేదని ఎర్రబెల్లి చెప్పారు. రైతులు సంతోషంగా ఉంటే జీర్ణించుకోలేని రాజగోపాల్ రెడ్డి 24 గంటల విద్యుత్ ఎందుకని అంటున్నారని ఆరోపించారు. యాదాద్రి విద్యుత్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని కోమటి రెడ్డి వ్యాఖ్యానించడం విచారకరమన్నారు. కోమటి రెడ్డి మాటలు వింటుంటే బాధవేస్తుందని విచారం వ్యక్తం చేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా అనేక ప్రభుత్వాలను చూశాను అయితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి ఏ ప్రభుత్వం చేయలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

Controversy between Rajagopal Reddy and Errabelli
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News