Monday, April 29, 2024

యూనిక్ స్టయిల్‌లో ‘డిపిరి డిపిరి…’

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ’కీడా కోలా’తో వస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి డిపిరి డిపిరి… పాటని విడుదల చేశారు. ఈ పాటని యూనిక్ స్టయిల్‌లో కంపోజ్ చేశారు వివేక్.

భరద్వాజ్ గాలి లిరిక్స్ అందించిన ఈ పాటని హనుమాన్ సిహెచ్ పాడిన విధానం చాలా ఎనర్జిటిక్‌గా వుంది. పాటలో వినిపించిన అరబిక్ ర్యాప్ కూడా అలరించింది. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. కీడా కోలా సినిమా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News